Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:01 PM

పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన హ్యూమన్ రైట్స్ సేవా కార్యక్రమం

22-01-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

ఉమ్మడి జిల్లా స్థానికం ప్రతినిధి కృష్ణ

తొర్రూరు డివిజన్ పరిధిలోని మహబూబాబాద్ జిల్లా, స్థానిక మున్సిపల్ కేంద్రంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అజర హాస్పిటల్ సహకారంతో మెగా ఆరోగ్య శిబిరాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆర్‌ఎంపీ ప్రకాష్ ఆధ్వర్యంలో నిర్వహించగా,నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా మంగళ పెల్లి హుస్సేన్ ముఖ్య అతిథిగా హాజరై మెగా ఆరోగ్య శిబిరాన్ని ఘనంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా డాక్టర్ మంగళ పెల్లి హుస్సేన్ మాట్లాడుతూ, ప్రజలకు ఉచిత వైద్య సేవలు అందించడం ఎంతో ప్రశంసనీయమని అన్నారు. అజర హాస్పిటల్‌కు చెందిన డాక్టర్ భరత్ ఈ ఆరోగ్య శిబిరంలో పాల్గొని రోగులకు ఉచితంగా సాధారణ వైద్య పరీక్షలు,రక్తపోటు,రక్తంలో చక్కెర స్థాయి పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులను ఉచితంగా అందించడం అభినందనీయమని తెలిపారు.ఇటువంటి సేవా కార్యక్రమాల ద్వారా పేద మరియు మధ్యతరగతి ప్రజలకు ఎంతో మేలు చేకూరుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ సోషల్ జస్టిస్ సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా బృంద సభ్యులు డాక్టర్ భరత్, ఆర్‌ఎంపీ ప్రకాష్, రాజేష్‌లను ప్రత్యేకంగా అభినందించారు. అలాగే ఈ ఆరోగ్య శిబిరాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీనివాసు, చిన్ని,రాజు,మురళి,కృష్ణ, బాలకృష్ణ,రాజేష్,మహేష్‌తో పాటు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు,మహిళలు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పేదల ఆరోగ్యానికి భరోసా కల్పించిన హ్యూమన్ రైట్స్ సేవా కార్యక్రమం

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News