Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:41 AM

పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి

11-03-2026 100 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఏలూరు: భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు, మాజీ కేంద్ర కాబినెట్ మంత్రి కావూరి సాంబశివరావు మరణం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ వారికి అశ్రునివాళి అర్పిస్తున్నామని ఏలూరు జిల్లా ఎస్‌సి మోర్చా అధ్యక్షులు శ్రీకర్ బుర్రి తెలిపారు.

దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన కావూరి సాంబశివరావు ప్రజా సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడని ఆయన పేర్కొన్నారు. రాజకీయాల్లో నిబద్ధత, క్రమశిక్షణతో పని చేస్తూ ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించిన నాయకుడిగా ఆయన నిలిచారని అన్నారు. పార్లమెంట్ సభ్యుడిగా, కేంద్ర మంత్రిగా పనిచేసిన సమయంలో దేశ అభివృద్ధికి పలు కీలక నిర్ణయాలు తీసుకుని ప్రజల మన్ననలు పొందారని తెలిపారు.

ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని, పారిశ్రామిక రంగం అభివృద్ధి, మౌలిక వసతుల కల్పనలో ఆయన పాత్ర ఎంతో గొప్పదని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, ప్రజల పట్ల నిబద్ధతతో ఎలా పని చేయాలో ఆయన తన జీవితంతో చూపించిన గొప్ప నాయకుడని కొనియాడారు.

కావూరి సాంబశివరావు గారి మరణం దేశానికి, రాష్ట్రానికి తీరని లోటని పేర్కొంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఈ దుఃఖ సమయంలో వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Sthanikam

పెద్దాయన కావూరి సాంబశివరావు కు అశ్రునివాళి

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News