Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 02:13 PM

పెద్దకాపర్తిలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కు ఊపు

15-03-2026 215 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

పారిశుధ్య కార్మికులకు హెల్త్ చెకప్, ఘన సన్మానం

నమూనా గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం

చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’ 99 రోజుల యాక్షన్ ప్లాన్‌కు ఆదివారం ఊపునిచ్చారు. గ్రామ సర్పంచ్ కాటం వెంకటేశం ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేకకార్యక్రమంలో గ్రామ పరిశుభ్రత, కార్మికుల సంక్షేమంపై ప్రధానంగా దృష్టి సారించారు.ఈ సందర్భంగా పారిశుధ్య కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రాధాన్యం ఇస్తూ వారికి హెల్త్ చెకప్ నిర్వహించారు. గ్రామ అభివృద్ధికి వెన్నెముకలుగా నిలిచే కార్మికులను సన్మానించి, సబ్బులు, కొబ్బరి నూనె, షాంపూ వంటి నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు.కార్యక్రమంలో మాట్లాడిన సర్పంచ్ కాటం వెంకటేశం గ్రామం శుభ్రంగా, ఆరోగ్యంగా ఉండటంలో పారిశుధ్య కార్మికుల సేవలు అమూల్యమని కొనియాడారు. గ్రామాన్ని ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దే లక్ష్యంతో 99 రోజుల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి పనులను వేగవంతం చేస్తున్నామని తెలిపారు. పరిశుభ్రత కేవలం కార్మికుల బాధ్యత మాత్రమే కాకుండా ప్రతి గ్రామస్థుడి బాధ్యత అని, “మన ఊరు – మన పరిశుభ్రత” భావనతో అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఓర్సు సైదులు, వార్డు సభ్యులు అర్పుల యాదయ్య, నీలకంఠం విజయ, కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు నీలకంఠం లింగస్వామి, మర్రి గోపాల్ రెడ్డి, సాగర్ల నాగరాజు, అనగంటి నరేష్, ఆశా వర్కర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

పెద్దకాపర్తిలో ‘ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక’కు ఊపు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News