Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

పెద్దబావి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

09-04-2026 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

మోటకొండూరు మండల పరిధిలోని పెద్దబావి (చాకంపల్లి) గ్రామానికి నూతనంగా వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేసిన సందర్భంగా ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మండల సేవాదళ్ అధ్యక్షుడు, ఆలేరు యువజన కాంగ్రెస్ నాయకుడు జల్తార్ రాజు యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా రాజు యాదవ్ మాట్లాడుతూ, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెద్దబావి గ్రామ రైతుల సమస్యలను గుర్తించి వెంటనే స్పందించి,వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మంజూరు చేయడం ద్వారా రైతుల ఇబ్బందులను తొలగించారని తెలిపారు. ఇందుకు ఆయన ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఇందిరమ్మ ఇళ్లు, గృహ జ్యోతి,ఉచిత కరెంట్,కొత్త రేషన్ కార్డులు,వడ్ల కొనుగోలు కేంద్రాలు వంటి సంక్షేమ పథకాల ద్వారా గ్రామాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. గ్రామంలో ఐకేపీ కేంద్రం లేక రైతులు ఇబ్బందులు పడుతున్న విషయం ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లిన వెంటనే ఆయన స్పందించి, అధికారులతో మాట్లాడి ప్రత్యేక చొరవతో కేంద్రాన్ని మంజూరు చేయించారని తెలిపారు. ఈ విషయానికి సంబంధం లేని సర్పంచ్, బీఆర్‌ఎస్ నాయకులు తమకే క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేయడం సరికాదని విమర్శించారు. ఈ విషయం గ్రామస్తులకు కూడా తెలుసని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందుతున్నాయని,ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నాయకత్వంలో పెద్దబావి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వాకిటి మల్లారెడ్డి, సిద్ధులు యాదవ్,సత్తిరెడ్డి,చంద్రారెడ్డి,శ్రీను,రామ్,తిరుమలరెడ్డి,రమేష్,యాదిరెడ్డి,ప్రశాంత్ యాదవ్ తదితర గ్రామ నాయకులు,రైతులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

Sthanikam

పెద్దబావి గ్రామంలో ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News