Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:02 PM

పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా

18-02-2026 199 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

చిట్యాల మండలం పెద్ద కాపర్తి గ్రామంలోని పెద్ద కాపర్తి లో ఉన్న శ్రీ శ్రీ శ్రీ భూ సమేత తిరుమనాథ స్వామి దేవాలయం లో శంకు–చక్రాల స్థాపన కార్యక్రమం మరియు హోమం వైభవంగా నిర్వహించారు. ఈ ధార్మిక కార్యక్రమానికి గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

శంకు–చక్రాల దాతగా సర్పంచుల ఫోరం అధ్యక్షులు కాటం వెంకటేశం పద్మ యాదవ్ ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. హోమ కార్యక్రమంలో గుడి చైర్మన్ ఒరుసు రాజకుమార్ దంపతులు భక్తిశ్రద్ధలతో హాజరై సేవలు అందించారు.

అలాగే ఉరుమడ్ల సర్పంచ్ సాగర్ల బిక్షం భాను, చిన్నకాపర్తి సర్పంచ్ ఆవుల సుందర్, పిట్టంపల్లి సర్పంచ్ అందే రాములు యాదమ్మ, తాళ్ల వెల్లంల సర్పంచ్ జోగు సురేష్, మాజీ ముద్దసాని నీత రమణారెడ్డి, ఉప సర్పంచ్ ఓరుసు సైదులు, డైరెక్టర్లు ఏర్పుల యాదమ్మ, నరసింహ, చలమల్ల మసూద్ రెడ్డి, జిల్లా నరసింహ, వార్డు సభ్యులు ఏర్పులకూరు యాదయ్య, సాగర్ల నవ్య, శ్రీ నాగరాజు, మర్రి హరీష్ రెడ్డి, జిల్లా ప్రశాంత్, ఏదుల అజిత్ రెడ్డి, తెలుసూరి సైదులు, నూతి వెంకటేశం, డాక్టర్ కిరణ్ తదితర నాయకులు, భక్తులు, గ్రామ ప్రజలు కార్యక్రమంలో పాల్గొన్నారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య శాస్త్రోక్తంగా శంకు–చక్రాల ప్రతిష్ఠాపన జరిగి, అనంతరం మహాప్రసాద వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంతో దేవాలయ మహోత్సవ వాతావరణం నెలకొంది. గ్రామ అభివృద్ధి, ఆధ్యాత్మిక చైతన్యం మరింత పెంపొందాలని పలువురు ఆకాంక్షించారు.

Sthanikam

పెద్ద కాపర్తిలో తిరుమనాథ స్వామి దేవాలయంలో శంకు–చక్రాల స్థాపన ఘనంగా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News