Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 03:58 PM

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ

06-02-2026 32 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నలగొండ జిల్లా చిట్యాల మండలం పెద్దకాపర్తి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మౌలిక వసతుల లోటును గమనించిన గ్రామానికి చెందిన దాత కామినేని దుర్గాకుమార్ విద్యార్థుల అవసరాలను తీర్చేందుకు ముందుకు వచ్చారు. పాఠశాలలో బెంచీలు లేక ఇబ్బంది పడుతున్న విద్యార్థుల కోసం సుమారు నాలుగున్నర లక్షల రూపాయల విలువ గల 68 డ్యూయల్ డెస్క్ బెంచీలను ఆయన స్వంత ఖర్చుతో పాఠశాలకు బహుకరించారు.

ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు పీఠం శ్రీధర్ ఆధ్వర్యంలో గురువారం దాతకు ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ, పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లో ఇటువంటి దాతల సహకారం ఎంతో కీలకమని అన్నారు. మౌలిక సదుపాయాలు మెరుగుపడితే విద్యార్థులకు అనుకూల వాతావరణంలో నాణ్యమైన విద్య అందించవచ్చని పేర్కొన్నారు. సమాజంలోని దాతలు ఇలాగే ముందుకు వచ్చి పాఠశాలలకు సహకరించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కాటం వెంకటేష్, ఉప సర్పంచ్ ఓర్సు సైదులు, వార్డ్ మెంబర్లు, మాజీ సర్పంచ్ కందిమల్ల శిశుపాల్ రెడ్డి, స్టేజ్ దాతలు ఎర్పుల నరసింహ, అజిత్ రెడ్డి, నీలకంఠ నరేష్, నీలకంఠం లింగస్వామి, ప్రధానోపాధ్యాయులు చంద్రమౌళి, చేకూరి గణేష్, గంట్ల తిరుమల్ రెడ్డి, పాఠశాల సీనియర్ ఉపాధ్యాయులు బచ్చు లుకేందర్ రెడ్డి, సాగర్ల నాగరాజు, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పెద్ద కాపర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు బెంచీల బహుకరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News