Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:28 AM

పేద విద్యార్థులను కించపరిచిన గరికపాటి పై తక్షణ చర్యలు తీసుకోవాలి

21-03-2026 35 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

-ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు

పేద విద్యార్థుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే కాకుండా,ప్రభుత్వ పాఠశాలలపై అపనిందలు మోపుతూ వ్యాఖ్యలు చేసిన గరికపాటి నరసింహారావుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు తీవ్రంగా డిమాండ్ చేశారు.శనివారం రోజు భువనగిరి జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవనం ప్రకటన విడుదల చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు లావుడియ రాజు మాట్లాడుతూ...ప్రవచనాల పేరుతో పిల్లలపై అసభ్యంగా,అవమానకరంగా మాట్లాడిన గరికపాటి వ్యాఖ్యలు పూర్తిగా అమానవీయమైనవని,ముఖ్యంగా విద్యార్థులను “శోభనం పెళ్లికొడుకు”తో పోల్చడం అనేది విద్యార్థి లోకాన్ని అవమానించడమేనని పేర్కొంది. పేద పిల్లలు కేవలం కోడిగుడ్డు కోసమే బడికి వస్తున్నారని చెప్పడం వారి పేదరికాన్ని ఎగతాళి చేయడమేనని విమర్శించింది.దేశవ్యాప్తంగా అమలవుతున్న మధ్యాహ్న భోజన పథకం విద్యార్థుల హాజరు పెరగడానికి,డ్రాపౌట్ తగ్గించడానికి,పౌష్టికాహార లోపాన్ని తగ్గించడానికి కీలక పాత్ర పోషిస్తున్నదని అనేక అధ్యయనాలు స్పష్టం చేస్తున్నాయి.స్వయంగా సుప్రీంకోర్టు కూడా ఈ పథకాన్ని అమలు చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే.అలాంటి పథకాన్ని అవహేళన చేస్తూ.. మాట్లాడటం గరికపాటి అజ్ఞానాన్ని,బాధ్యతారాహిత్యాన్నిబయటపెడుతుందని పేర్కొంది.దేశంలో సుమారు 84శాతం మంది తల్లులు,పిల్లలు పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న సమయంలో,విద్యార్థులకు అందించే గుడ్డును “గాడిద గుడ్డు”గా వ్యాఖ్యానించడం ఆకలిని,పేదరికాన్ని కించపరచడమేనని తీవ్రంగా ఖండించింది. విద్యార్థులకు ఉచిత భోజనం,పుస్తకాలు,యూనిఫాంలు అందించడం ప్రభుత్వం యొక్క బాధ్యత అని,దానిని “బిచ్చం”గా అభివర్ణించడం సిగ్గుచేటని విమర్శించింది.కార్పొరేట్ కంపెనీలకు ఇచ్చే లక్షల కోట్ల రాయితీలపై ఎప్పుడూ స్పందించని గరికపాటి,పేద పిల్లలకు అందించే భోజనంపై విషం కక్కడం దుర్మార్గమని ఎస్ఎఫ్ఐ హెచ్చరిస్తుంది.

Sthanikam

పేద విద్యార్థులను కించపరిచిన గరికపాటి పై తక్షణ చర్యలు తీసుకోవాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News