Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 01:19 PM

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన

10-03-2026 24 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Penukonda
EDIGA NAVEENKUMAR

శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండ పట్టణంలో పెంచిన వంట గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిస్ట్ పార్టీ అఫ్ ఇండియా (మారక్సిస్ట్) ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం అంబేద్కర్ సర్కిల్ వద్ద జరిగింది.

ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు హరి మాట్లాడుతూ వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.60, వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను రూ.115 పెంచడాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతర్జాతీయ పరిస్థితులు, ముఖ్యంగా ఇరాన్ పై యునైటెడ్ స్టేట్స్ మరియు ఇజ్రాయెల్ దాడులు, అలాగే రష్యా నుంచి ఆయిల్ కొనుగోలుపై ఆంక్షలు వంటి పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. ఆ భారాన్ని ప్రజలపై మోపడం అన్యాయమన్నారు.

ఇప్పటికే కరెంట్ చార్జీలు, నిత్యవసర సరుకుల ధరలు పెరిగి సామాన్యులు ఇబ్బందులు పడుతున్న సమయంలో గ్యాస్ ధరల పెంపు మరింత భారంగా మారిందన్నారు. దేశంలో ఆయిల్, గ్యాస్ నిల్వలు ఉన్నప్పటికీ ధరలు పెంచడం ప్రజలపై మోయలేని భారమని పేర్కొన్నారు. ముఖ్యంగా ఉగాది , రంజాన్ పండగల సమయంలో ప్రజలపై ఈ భారాన్ని మోపడం అన్యాయమని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, బాబావాలి, గంగాధర్, వెంకట్రాముడు, హనుమంతు, శివ, ఓబులేసు, వలి, బాబు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: సీపీఎం నిరసన

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News