Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:42 AM

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: చిత్తూరులో రాస్తారోకో

10-03-2026 87 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి: నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం చిత్తపూరు గ్రామంలో కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఎంఎల్ లిబరేషన్, అఖిల భారత ప్రగతిశీల మహిళా సంఘం ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.

ఈ సందర్భంగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డి. హరినాథ్ మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్యాస్ ధరలను రూ.60 వరకు పెంచడం ద్వారా సామాన్య ప్రజలపై తీవ్ర భారం మోపాయని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం వరుసగా గ్యాస్ ధరలు పెంచుతున్నా కూటమి పాలకులు నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.

రాష్ట్రంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా తిరుపతి లడ్డూ కల్తీ అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర వస్తువుల ధరలు రోజురోజుకు ఆకాశాన్ని అంటుతున్నాయని తెలిపారు.

చిత్తపూరు గ్రామంలో నెలకొన్న పలు సమస్యలపై రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథిని త్వరలో కలవనున్నట్లు చాట్రాయి మండల కార్యదర్శి కలపాల వెంకటేశ్వరరావు తెలిపారు.

ఈ కార్యక్రమంలో లిబరేషన్ జిల్లా కమిటీ సభ్యులు చాట్ల బాబురావు, వేముల బక్కయ్య, భవాని, కొత్తపల్లి ప్రసాద్, సోమేశ్వరరావు, పుల్లారావు, నారాయణ, రామారావు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి: చిత్తూరులో రాస్తారోకో

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News