Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 03:25 AM

పోలింగ్ స్లిప్పుల వ్యవహారంపై అధికారులపై వేటు

14-12-2025 80 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

స్థానికం ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల పోలింగ్ స్లిప్పులు డ్రైనేజీలో పడివున్న ఘటన జిల్లా వ్యాప్తంగా కలకలం రేపింది. ఘటనపై నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తీవ్రంగా స్పందించారు. ఎన్నికల విధుల్లో ఘోర నిర్లక్ష్యం వహించారంటూ చిట్యాల ఎంపీడీవో జయలక్ష్మిని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆమెతో పాటు మరో పది మంది పోలింగ్ అధికారులపై కూడా సస్పెన్షన్ వేటు పడింది.

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పవిత్రతకు భంగం కలిగేలా జరిగిన ఈ ఘటనను కలెక్టర్ తీవ్రంగా పరిగణించారు. పోలింగ్ స్లిప్పులు డ్రైనేజీలో కనిపించడంపై విచారణ చేపట్టిన జిల్లా యంత్రాంగం, బాధ్యతారాహిత్యమే ఇందుకు కారణమని నిర్ధారించింది. ప్రజాస్వామ్య ప్రక్రియపై విశ్వాసం దెబ్బతినే చర్యలను సహించబోమని కలెక్టర్ స్పష్టం చేశారు.

మొత్తానికి చిన్నకాపర్తిలో బ్యాలెట్ పేపర్లు–పోలింగ్ స్లిప్పుల వ్యవహారం అధికారులకు పెద్ద షాక్‌గా మారింది. ‘వార్త ఎఫెక్ట్’తో జిల్లా యంత్రాంగం కఠిన చర్యలకు దిగడం రాజకీయ వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల విధుల్లో పారదర్శకత, బాధ్యత తప్పనిసరిగా ఉండాలన్న సందేశాన్ని ఈ సస్పెన్షన్లు స్పష్టంగా ఇచ్చాయి.

Sthanikam

పోలింగ్ స్లిప్పుల వ్యవహారంపై అధికారులపై వేటు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News