Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:26 AM

పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

16-03-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

రాజపేట,మండలంలోని దూదివెంకటాపురం, రేణికుంట గ్రామాల్లో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సోమవారం పర్యటించి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.దూదివెంకటాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్న ఆయన గ్రామాభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల భాగస్వామ్యం ఎంతో కీలకమని తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరేలా గ్రామస్థులు సహకరించాలని కోరారు. గ్రామ సమస్యలను గ్రామసభలోనే చర్చించి పరిష్కరించుకోవాలని సూచించారు. అధికారులు, ప్రజలు కలిసి పనిచేస్తే గ్రామాలు వేగంగా అభివృద్ధి చెందుతాయని అన్నారు.అనంతరం రేణికుంట గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించిన అదనపు కలెక్టర్ విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. విద్యార్థులకు పరిశుభ్రంగా,పోషకాహారంతో కూడిన నాణ్యమైన భోజనం అందించాలని పాఠశాల సిబ్బందికి సూచించారు. మంచి నీటి సౌకర్యాన్ని పరిశీలించి విద్యార్థుల ఆరోగ్యం,చదువుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఉపాధ్యాయులకు ఆదేశించారు.తరువాత రేణికుంట గ్రామంలోని నర్సరీని సందర్శించి మొక్కల పెంపకం, సంరక్షణపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. గ్రామాల్లో విస్తృతంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని సూచించారు.అనంతరం రేణికుంట గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి సిబ్బంది హాజరు రిజిస్టర్‌ను పరిశీలించారు. సిబ్బంది సమయపాలన పాటిస్తూ గ్రామ ప్రజలకు అవసరమైన సేవలను త్వరితగతిన అందించాలని సూచించారు. మార్చి 31లోపు వంద శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో దూది వెంకటాపురం సర్పంచ్ నరేష్, రేణికుంట సర్పంచ్ కర్రె వెంకటేష్, ఎంపీవో ఆవుల కిషన్, ఇంచార్జ్ ఏపీవో కర్ణాకర్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పాఠశాలల్లో నాణ్యమైన భోజనం అందించాలి: అదనపు కలెక్టర్ భాస్కర్ రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News