నారాయణఖేడ్ స్థానికం ప్రతినిధి కృష్ణ:నారాయణఖేడ్ మండలం పరిధిలోని పంచగామ గ్రామంలో బుధవారం మండల జిల్లా నోడల్ అధికారి యశ్వంత్ ప్రాథమిక పాఠశాల పంచగామను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన పాఠశాల పరిసరాలను పరిశీలించి, తరగతి గదులు, విద్యార్థుల హాజరు, బోధన విధానం, మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును సమగ్రంగా పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారి విద్యా ప్రమాణాలు, పాఠశాలలో అందుతున్న సౌకర్యాలపై వివరాలు తెలుసుకున్నారు. అనంతరం ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడంతో పాటు ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు. పాఠశాల అభివృద్ధికి అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు బృందం తదితరులు పాల్గొన్నారు.
పాఠశాల సదుపాయాలు, విద్యా ప్రమాణాలపై నోడల్ అధికారి పరిశీలన
పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి