Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:50 AM

పాత మిర్చి యార్డు దుస్థితి

పాత మిర్చి యార్డు దుస్థితి

పాత మిర్చి యార్డు దుస్థితి
10-02-2026 158 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిన స్థలం

సూర్యాపేట పట్టణంలోని పాత మిర్చి యార్డు స్థలం అసాంఘిక కార్యకలాపాలకు ప్రధాన కేంద్రంగా మారింది. ఈ స్థలాన్ని ఎవరూ పట్టించుకోకపోవడంతో నియోజకవర్గ కేంద్రం చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక జిల్లా కేంద్రం నుంచి కూడా రకరకాల వ్యక్తులు ఇక్కడికి చేరుకుంటున్నారు.ఈ స్థలం మలమూత్రాల విసర్జనకు అడ్డాగా మారడమే కాకుండా పశువులు, పందులు, కుక్కలు తిరిగే ప్రదేశంగా తయారైంది. పగలంతా ఇక్కడ అనవసర సమావేశాలు, కాలక్షేపం, మద్యం సేవించే గుంపులు కూర్చుంటుండగా, రాత్రి వేళ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయనే అనుమానాలు అక్కడి పరిస్థితులు స్పష్టంగా తెలియజేస్తున్నాయి.

విశేషమేమిటంటే ఇదే స్థలానికి ఆనుకొని సూర్యాపేట శాసనసభ్యుల శిబిర కార్యాలయం ఉండటం. అయినా సంబంధిత అధికారులు తెలిసీ తెలిసీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణ మధ్యలో ఉన్న ఈ స్థలాన్ని అష్టదరిద్రంగా, కంపు కంపుగా వదిలేయడం దురదృష్టకరమని, శోచనీయమని ప్రజలు అంటున్నారు.సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఈ స్థలాన్ని శుభ్రపరచడంతో పాటు, లోపలికి ఎవరు ప్రవేశించకుండా తగిన భద్రత ఏర్పాటు చేయాలని, పట్టణ గౌరవాన్ని కాపాడాలని ప్రజలు కోరుతున్నారు.

Sthanikam

పాత మిర్చి యార్డు దుస్థితి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News