Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:44 AM

పటేల్ రమేష్ రెడ్డి వ్యూహం ఇదేనా

పటేల్ రమేష్ రెడ్డి వ్యూహం ఇదేనా

పటేల్ రమేష్ రెడ్డి వ్యూహం ఇదేనా
10-02-2026 346 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట రాజకీయాల్లో కొత్త మలుపు?

మున్సిపల్ ఎన్నికల అనంతరం సూర్యాపేట నియోజకవర్గ రాజకీయాలు కీలక మలుపు తిరగనున్నాయనే చర్చ జోరుగా సాగుతోంది. శాసనసభ్యుడిగా గెలిచి అసెంబ్లీకి వెళ్లాలన్న తన చిరకాల ఆకాంక్షను నెరవేర్చుకునే దిశగా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి శాఖ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.రాజకీయంగా తన ఎదుగుదలకు అన్ని విధాలుగా తోడ్పడిన పాత తరం నాయకులు, కార్యకర్తలను మున్సిపల్ ఎన్నికల అనంతరం ఏకం చేయాలని రమేష్ రెడ్డి భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందుకోసం ఇప్పటినుంచే నియోజకవర్గంలో బలమైన కేడర్‌ను సిద్ధం చేసే దిశగా కార్యాచరణ రూపొందిస్తున్నారని సమాచారం.ఇతర పార్టీలలో కొనసాగుతున్న పాత బ్యాచ్ సభ్యులు ఎన్నికల తర్వాత రమేష్ రెడ్డి నాయకత్వాన్ని ఆశ్రయించే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీఆర్ఎస్, బీజేపీ, టీడీపీ, వామపక్ష పార్టీలలో ఉన్న ఆయన అనుచరులు తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి రావచ్చనే చర్చ జరుగుతోంది.ఇదే జరిగితే సూర్యాపేట రాజకీయ సమీకరణలు పూర్తిగా మారతాయని, పార్టీలకు పార్టీల మధ్య కదలికలు పెరిగే అవకాశముందని నాయకులు అభిప్రాయపడుతున్నారు. త్వరలో పార్టీలు మారబోయే కౌన్సిలర్ అభ్యర్థులు ఎవరు అనే అంశంపై నియోజకవర్గవ్యాప్తంగా రాజకీయ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.

Sthanikam

పటేల్ రమేష్ రెడ్డి వ్యూహం ఇదేనా

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News