Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బట్టలు ఉతికేందుకు వెళ్లి విగతజీవులైన ముగ్గురు.. మానూరులో విషాదం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 05:15 PM

పట్టణాభివృద్ధికి వేగం… మౌలిక సదుపాయాలే తొలి ప్రాధాన్యం- చైర్మన్ పావని రమేష్ గౌడ్

02-04-2026 59 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

ప్రజల ముంగిటకే పాలన… చౌటుప్పల్‌లో వార్డు సభల సందడి

అర్హులందరికీ ఇళ్లు–పెన్షన్లు… కౌన్సిలర్ల స్పష్టమైన హామీ

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘ప్రజా పాలన–ప్రగతి నివేదిక’ 99 రోజుల ప్రణాళికలో భాగంగా చౌటుప్పల్ మున్సిపాలిటీలోని 20 వార్డుల్లో వార్డు కౌన్సిలర్ల ఆధ్వర్యంలో వార్డు సభలు ఘనంగా నిర్వహించారు. ఈ సభల్లో కౌన్సిలర్లు ప్రజలతో నేరుగా మమేకమై వారి సమస్యలను తెలుసుకున్నారు.వార్డుల సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తూ పట్టణ పారిశుధ్యం నుంచి మౌలిక సదుపాయాల కల్పన వరకు పనులను వేగవంతం చేస్తున్నట్లు కౌన్సిలర్లు తెలిపారు. ఇందిరమ్మ ఇళ్లు, వృద్ధాప్య పెన్షన్లు తదితర పథకాల కోసం పెద్ద ఎత్తున వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అధికారులతో సమన్వయం… సమస్యలకు వెంటనే స్పందన మున్సిపల్ చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్, కమిషనర్ జి. వెంకటరామిరెడ్డి పాల్గొని కౌన్సిలర్లు, అధికారులకు దిశానిర్దేశం చేశారు. విద్యుత్, ఆరోగ్య తదితర శాఖల అధికారులు ప్రజల సమస్యలను నమోదు చేసుకున్నారు. పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కార మార్గాలను సూచించారు.పారదర్శకతే ప్రమాణం… ప్రతి ఇంటికీ సంక్షేమం“ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య కౌన్సిలర్లు వారధిలా పనిచేస్తున్నారు. పార్టీలకతీతంగా అర్హతే ప్రామాణికంగా పథకాలు అందిస్తాం” అని కౌన్సిలర్లు స్పష్టం చేశారు. డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి సమస్యలపై ప్రత్యేక నివేదికలు సిద్ధం చేసి త్వరితగతిన పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు.ఈ సందర్భంగా చైర్ పర్సన్ మొగుదాల పావని రమేష్ గౌడ్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో 20 వార్డుల కౌన్సిలర్లు, మున్సిపల్ సిబ్బంది, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

Sthanikam

పట్టణాభివృద్ధికి వేగం… మౌలిక సదుపాయాలే తొలి ప్రాధాన్యం- చైర్మన్ పావని రమేష్ గౌడ్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News