Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 05:10 PM

పట్టణ అభివృద్ధి హామీలతో ఖేడ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో: మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే

09-02-2026 57 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా నేడు నారాయణఖేడ్ పట్టణంలో రోడ్ షో మరియు కార్నర్ మీటింగ్ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి మహ్మద్ అజారుద్దీన్,జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్ శేట్కర్,నారాయణఖేడ్ శాసనసభ్యులు డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి,నగేష్ శేట్కర్ పాల్గొన్నారు.కార్యక్రమానికి ముందు మంత్రి అజారుద్దీన్ స్థానిక ఎమ్మెల్యే సంజీవరెడ్డి నివాసంలో మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మంగళ్‌పేట్‌లోని దుర్గ భవాని ఆలయం నుండి బైపాస్‌లో ఉన్న శివాజీ చౌక్ వరకు భారీ ర్యాలీగా సాగారు. అక్కడి నుంచి రాజీవ్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో పాల్గొని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి అజారుద్దీన్ నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరాల్సిందేనని స్పష్టం చేశారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఎన్నికలను సవాలుగా తీసుకుని పార్టీ విజయానికి అంకితభావంతో పని చేయాలని పిలుపునిచ్చారు. గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నారాయణఖేడ్ పట్టణాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, కనీస మౌలిక సదుపాయాలు కూడా అందించలేక ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని విమర్శించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ పట్లోళ్ల సంజీవరెడ్డి మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత నారాయణఖేడ్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు.పట్టణంలో రింగ్ రోడ్డు, అర్బన్ పార్క్, పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు, త్రాగునీటి సమస్య పరిష్కారం, నిరంతర విద్యుత్ సరఫరా వంటి అంశాలపై చర్యలు తీసుకున్నామని చెప్పారు. ప్రతి కాలనీలో సీసీ రోడ్లు, డ్రైనేజీ కాలువలు నిర్మించి, ప్రతి గల్లీ అభివృద్ధి చెందేలా ప్రణాళికబద్ధంగా పనులు చేపట్టామని తెలిపారు.ఈ కార్యక్రమంలో నారాయణఖేడ్ మున్సిపల్ పరిధిలోని 15 వార్డుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు,పట్టణ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

పట్టణ అభివృద్ధి హామీలతో ఖేడ్‌లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచార ర్యాలీలో: మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News