Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బంగారం రికవరీలో పక్కదారి ఆరోపణలు! దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 09:31 AM

పసుమాముల–కళానగర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం

02-01-2026 81 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హయత్‌నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు

హయత్ నగర్ స్థానిక ప్రతినిధి

పసుమాముల, కళానగర్ గ్రామాల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల హయత్‌నగర్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో శీతాకాల ప్రత్యేక శిబిరాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రిన్సిపల్ డా. పి. సురేష్‌బాబు శిబిరాలను ప్రారంభించి మాట్లాడారు. ఎన్ఎస్ఎస్ యూనిట్–1 వాలంటీర్లు కళానగర్‌లో, యూనిట్–2 వాలంటీర్లు పసుమాముల గ్రామంలో జనవరి 8 వరకు ఏడు రోజులపాటు నివసిస్తూ గ్రామస్తుల సహకారంతో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారని తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన స్థానిక ప్రజాప్రతినిధి కొత్త జైపాల్ రెడ్డి మాట్లాడుతూ, సేవాభావంతో గ్రామానికి వచ్చిన కళాశాల వాలంటీర్లకు గ్రామం తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు.

శిబిర ప్రారంభ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బాబురావు, కళాశాల అకాడమీ కోఆర్డినేటర్ బి. నరసింహ, అధ్యాపకులు రమాదేవి, సుబ్రహ్మణ్యం, శ్రీపతి నాయుడు, నాగరాజు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్లు యాదగిరి రెడ్డి, శారదా దేవి, స్థానికులు బిక్షపతి, బాలరాజు తదితరులు పాల్గొన్నారు. వాలంటీర్ల ఉత్సాహం గ్రామాల్లో సేవా వాతావరణాన్ని నెలకొల్పిందని గ్రామస్తులు అభినందించారు.

Sthanikam

పసుమాముల–కళానగర్‌లో ఎన్ఎస్ఎస్ శీతాకాల ప్రత్యేక శిబిరాల ప్రారంభం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News