Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:27 AM

ప్రొ. రాం రెడ్డి సేవలు చిరస్మరణీయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ

16-05-2026 154 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్: దూరవిద్య పితామహుడు, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వ్యవస్థాపక వైస్‌ ఛాన్సలర్ ప్రొ. జి. రాం రెడ్డి సేవలు మరువలేనివని వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి అన్నారు. విద్యా వారోత్సవాల్లో భాగంగా విశ్వవిద్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ప్రొ. రాం రెడ్డి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన “లీడర్‌షిప్ కనెక్ట్” కార్యక్రమంలో ప్రొ. చక్రపాణి మాట్లాడుతూ దూరవిద్య విస్తరణకు ప్రొ. రాం రెడ్డి చేసిన కృషి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిందన్నారు. అనేక సార్వత్రిక విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ఆయన మార్గదర్శకులయ్యారని పేర్కొన్నారు. అనంతరం సీఎస్టీడీ భవనంలో ఏర్పాటు చేసిన ప్రొ. ఆర్‌వీఆర్ చంద్రశేఖర్‌రావు సినర్జీ హాల్‌ను ప్రారంభించారు.

పద్మ అవార్డుతో గౌరవించాలి

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం మాజీ ఆచార్యులు ప్రొ. జి. హరగోపాల్ మాట్లాడుతూ ప్రొ. రాం రెడ్డి సేవలకు గుర్తింపుగా పద్మ అవార్డు ప్రకటించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు.

మాజీ వీసీ ప్రొ. వి.ఎస్. ప్రసాద్ మాట్లాడుతూ ప్రొ. రాం రెడ్డి దార్శనికతను కొనియాడారు. విశ్వవిద్యాలయం అభివృద్ధికి ఆయన వేసిన పునాదులు ఇప్పటికీ మార్గనిర్దేశకంగా ఉన్నాయని తెలిపారు.

కార్యక్రమంలో ప్రమీలా రాం రెడ్డి, జ్యోతి, ప్రొ. జి. పుష్పా చక్రపాణి, డా. ఎల్. విజయకృష్ణారెడ్డి, అధ్యాపకులు, మాజీ ప్రొఫెసర్లు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రొ. రాం రెడ్డి సేవలు చిరస్మరణీయం అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో విగ్రహావిష్కరణ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News