Sthanikam - Truth Matters
Logo

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ

Updated : 09 Mar 2026 18:04 IST
As Preferred Source 1 min read
పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది  చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చిట్యాల మున్సిపాలిటీ చైర్మన్ పందిరి గీత ప్రజలకు పిలుపునిచ్చారు. నల్గొండ జిల్లా నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని చిట్యాల మున్సిపాలిటీలో ప్రభుత్వం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్న ప్రజాపాలన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా సోమవారం మూడో వార్డులో పరిశుభ్రత కార్యక్రమం చేపట్టారు.

వీధుల్లో పేరుకుపోయిన చెత్తను మున్సిపల్ సిబ్బందితో కలిసి సేకరించి చెత్త వాహనాలలో తరలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ దోమల వ్యాప్తి వంటి సమస్యలను నివారించాలంటే ప్రజలు తమ చుట్టుపక్కల ప్రదేశాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రమైన పరిసరాలు ఆరోగ్యకరమైన జీవనానికి దోహదపడతాయని పేర్కొన్నారు.ఈ సందర్భంగా మూడో వార్డు వనిపాకాల రోడ్ నుండి శ్రీరామ్ నగర్ కాలనీ వరకు నిర్వహించిన అవగాహన ర్యాలీని ఆమె జెండా ఊపి ప్రారంభించారు. ర్యాలీ ద్వారా పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గుండెబోయిన శ్రీలక్ష్మి, కమిషనర్ దండు శ్రీను, కౌన్సిలర్లు, అంగన్వాడీ సిబ్బంది, విబీకేలు, మున్సిపల్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, పట్టణ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

పరిశుభ్రతే ఆరోగ్యానికి పునాది చిట్యాల మున్సిపాలిటీలో అవగాహన ర్యాలీ

Article Image

మరిన్ని

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Latest news