Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 11:28 AM

పరిశుభ్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

పరిశుభ్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

పరిశుభ్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత
22-02-2026 182 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

స్వచ్ఛ జల–స్వచ్ఛ మన కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నివేదిత లక్షాది

సూర్యాపేట పట్టణం, ఫిబ్రవరి 22: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని మున్సిపల్ చైర్‌పర్సన్ మొరిశెట్టి నివేదిత లక్షాది పేర్కొన్నారు. హారదేవ్ సింగ్ మహరాజ్ జయంతిని పురస్కరించుకుని నిరంకారి మిషన్, మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ప్రాజెక్ట్ అమృత్‌లో భాగంగా ఆదివారం స్థానిక మినీ ట్యాంక్‌బండ్ వద్ద “స్వచ్ఛ జల–స్వచ్ఛ మన” కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రాగునీరు స్వచ్ఛంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం కాపాడబడుతుందని, అందువల్ల ప్రతి ఒక్కరూ నీటి వనరుల సంరక్షణకు కృషి చేయాలని కోరారు. స్వచ్ఛ జల–స్వచ్ఛ మన వంటి కార్యక్రమాలు సమాజానికి ఆదర్శంగా నిలుస్తాయని తెలిపారు. ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఇలాంటి సేవా కార్యక్రమాలు అవసరమని చెప్పారు. యువత సామాజిక సేవలో ముందుండాలని పిలుపునిచ్చారు.

ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున నిరంకారి మిషన్ సేవా కార్యక్రమాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. సూర్యాపేట సంయోజక కె సరళ మాట్లాడుతూ మహరాజ్ చూపిన మార్గంలో మానవతా సేవే ముఖ్యమని, మనసు స్వచ్ఛంగా ఉంటే సమాజం కూడా స్వచ్ఛంగా మారుతుందని తెలిపారు. ప్రాజెక్ట్ అమృత్ ద్వారా నీటి వనరుల పరిరక్షణకు కృషి చేస్తున్నామని చెప్పారు.

కార్యక్రమంలో భాగంగా సద్దుల చెరువు కట్టపై పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించి పరిసరాలను శుభ్రపరిచారు.

ఈ కార్యక్రమంలో 29వ వార్డు కౌన్సిలర్ రాపర్తి భవాని శ్రీనివాస్, పర్యావరణ ఇంజనీర్ శివప్రసాద్, జవాన్ వేణు, నర్సింహారెడ్డి, ఎం. విద్యాసాగర్, కె. లక్ష్మారెడ్డి, హరీశ్, రాజేశ్, అంజలి, రవి, లక్ష్మీ, నిర్మల, వెంకటేశ్వర్లు తదితరులు, సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

Sthanikam

పరిశుభ్రత ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News