Sthanikam - Truth Matters
Logo

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం.

Updated : 04 Feb 2026 16:35 IST
As Preferred Source 1 min read
పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం.

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం.

నాగార్జున ప్రభుత్వ కళాశాల (స్వ) రసాయన శాస్త్ర విభాగ ఆధ్వర్యంలో డిగ్రీ తృతీయ సంవత్సరం విద్యార్థులు ఆర్మాల బాలి ప్రాంతంలో నెలకొల్పబడిన నిధి పివిసి పైపుల తయారీ పరిశ్రమను బుధవారం సందర్శించారు. ఈ క్షేత్రపర్యటనలో భాగంగా విద్యార్థులు పైపుల తయారీలో ఉన్న వివిధ దశలను యాజమాన్యాన్ని అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమ అధికారులు విద్యార్థుల సందేహలను నివృత్తి చేయడం జరిగింది. తరగతి గదుల్లో నేర్చుకున్న సిద్ధాంతపరమైన అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించే లక్ష్యంతో ఈ పర్యటనను ఏర్పాటు చేశామని రసాయనశాస్త్ర విభాగం అధ్యక్షులు డా. అంతటి శ్రీనివాస్ అన్నారు. పరిశ్రమలో పనిచేసే సాంకేతిక నిపుణులు పైపుల తయారీ ప్రక్రియను వివరించారు. విద్యార్థులు రెసిన్ (Resin) మరియు ఇతర రసాయనాలను ఏ నిష్పత్తిలో కలుపుతారో పరిశీలించారు.మిశ్రమం వేడి చేయబడి, మెషిన్ ద్వారా పైపు ఆకారాన్ని ఎలా పొందుతుందో ఉత్పాదక ప్రక్రియ చూశారు. తయారైన పైపుల దృఢత్వాన్ని, నాణ్యతను (Quality Control) పరీక్షించే విధానాలను నిపుణులు వివరించారు. వ్యర్థాల నిర్వహణ మరియు పర్యావరణానికి హాని కలగకుండా పరిశ్రమ తీసుకుంటున్న జాగ్రత్తల గురించి విద్యార్థులు అడిగి తెలుసుకున్నారు.ఈ పర్యటన విద్యార్థులకు ఎంతో విజ్ఞానదాయకంగా ఉందని, పారిశ్రామిక రంగంపై అవగాహన పెంచుకోవడానికి ఇలాంటి సందర్శనలు దోహదపడతాయని ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ తెలిపారు. క్షేత్రపర్యటనలో

వైస్ ప్రిన్సిపాల్ డా॥పరంగి రవికుమార్, డా|| బి. వెంకటేశ్వర్లు విద్యార్థులు పాల్గొన్నారు .

Sthanikam

పారిశ్రామిక రసాయన శాస్త్రం అనుభవం.. నాగార్జున కళాశాల విద్యార్థుల క్షేత్ర ప్రయాణం.

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి