Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కాంగ్రెస్‌ నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదు....... ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 02, 2026 11:54 AM

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి
24-03-2026 49 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

సూర్యాపేట జిల్లాలో కొత్త పరిశ్రమల ఏర్పాటుకు సకాలంలో అనుమతులు మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అధికారులకు సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిశ్రమల స్థాపనకు వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఒకే కేంద్ర విధానం ద్వారా అనుమతులు ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలో 36 పరిశ్రమలకు సంబంధించి 63 అనుమతులు వివిధ శాఖల ద్వారా వచ్చాయని, వాటిని అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల ప్రకారం ఆమోదించాలని సూచించారు.

పరిశ్రమల అభివృద్ధి ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు సంబంధించిన ప్రత్యేక పథకం కింద 82 యూనిట్లను మంజూరు చేసినట్లు తెలిపారు. సమావేశంలో పరిశ్రమల శాఖ ప్రధాన అధికారి టి సీతారాం, వాణిజ్య పన్నుల అధికారి బి యాదగిరి, జిల్లా పంచాయతీ అధికారి కె యాదగిరి, ఎస్సీ అభివృద్ధి అధికారి దయానంద రాణి, ఎస్టీ అభివృద్ధి అధికారి కె శంకర్, ఫ్యాక్టరీల పరిశీలకురాలు శ్రీదేవి తదితర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

పరిశ్రమలకు సకాలంలో అనుమతులు ఇవ్వాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News