Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 03:55 AM

ప్రెస్ కాలనీ లో శ్రీ చైత్ర హైస్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం**

ప్రెస్ కాలనీ లో శ్రీ చైత్ర హైస్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం**

ప్రెస్ కాలనీ లో శ్రీ చైత్ర హైస్కూల్ నూతన బ్రాంచ్ ప్రారంభం**
March 23, 2026 12:51 AM 22 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Rangareddy dist
RAPOLU LINGASWAMY

:ప్రాంతీయ విద్యా రంగంలో మరో కీలక అడుగు ముందుకు పడింది. శ్రీ చైత్ర హైస్కూల్ నూతన బ్రాంచ్‌ను ఆదివారం చంపాపేట్ ప్రెస్ కాలనీ లో ఘనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమం విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రజల సమక్షంలో ఉత్సాహభరితంగా జరిగింది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఐఎస్ సదన్ డివిజన్ తాజా,మాజీ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి, సైదాబాద్ డివిజన్ తాజా,మాజీ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై బిబ్బన్ కట్ చేసి ఘనంగా నూతన బ్రాంచ్‌ను ప్రారంభించారు. అనంతరం నిర్వాహకులతో కలిసి స్కూల్‌ను పరిశీలించి, విద్యా సదుపాయాలను అభినందించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి సమాజంలో నాణ్యమైన విద్య అందరికీ అందుబాటులో ఉండటం అత్యంత అవసరమని తెలిపారు. ముఖ్యంగా మధ్య తరగతి, పేద కుటుంబాలకు తక్కువ ఫీజులతో ఉత్తమ విద్యను అందించడం ద్వారా విద్యార్థుల భవిష్యత్తుకు బలమైన పునాది వేయవచ్చని పేర్కొన్నారు. ఈ దిశగా శ్రీ చైత్ర హైస్కూల్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమని కొనియాడారు.

శ్రీ చైత్ర స్కూల్ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకుని, తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్యను అందిస్తూ సామాన్య ప్రజలకు చేరువైన విద్యాసంస్థగా ఎదిగిందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తూ దినదినాభివృద్ధి సాధిస్తున్న ఈ విద్యాసంస్థ ప్రెస్ కాలనీలో మరో బ్రాంచ్‌ను ప్రారంభించడం ఆనందదాయకమని అన్నారు.

ఈ కార్యక్రమంలో పౌండర్, మానేజింగ్ డైరెక్టర్ అక్షయ్ కుమార్, డైరెక్టర్ శిరీష, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. కార్యక్రమం ముగింపు సందర్భంగా నిర్వాహకులు అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News