Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 08:23 AM

ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్ ఐ ..!

13-05-2026 172 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు

ఎస్సై సురేష్ కుమార్ సస్పెండ్

2018 బ్యాచ్‌కు చెందిన ఎస్సై సురేష్ కుమార్ ప్రస్తుతం కొల్లూరు పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న మహిళా కానిస్టేబుల్‌తో పరిచయం ఏర్పడి, అది ప్రేమగా మారినట్లు సమాచారం.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతికి మరింత దగ్గరైన ఎస్సై.. కొంతకాలం తర్వాత పెళ్లి విషయంపై ఒత్తిడి రావడంతో తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది.

ఇటీవల పెళ్లి అంశంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తనను మోసం చేస్తున్నాడని అనుమానించిన మహిళా కానిస్టేబుల్ గట్టిగా నిలదీయగా.. ఎస్సై సురేష్ పెళ్లి సాధ్యం కాదని తేల్చి చెప్పినట్లు తెలిసింది.

దీంతో బాధితురాలు కూకట్‌పల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు సురేష్‌ను విచారించేందుకు ప్రయత్నించగా.. అతను ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసి అందుబాటులో లేకపోయినట్లు సమాచారం.

బాధితురాలు సమర్పించిన ఆధారాల ఆధారంగా ఉన్నతాధికారులు ఎస్సై సురేష్ కుమార్‌ను సస్పెండ్ చేసినట్లు తెలిసింది.

Sthanikam

ప్రేమ పేరుతో మహిళా కానిస్టేబుల్‌ను మోసం చేసిన ఎస్ ఐ ..!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News