Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:48 AM

ప్రేమ కరుణతో సర్వం సుసాధ్యం

ప్రేమ కరుణతో సర్వం సుసాధ్యం

ప్రేమ కరుణతో సర్వం సుసాధ్యం
03-04-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

భక్తిశ్రద్ధలతో గుడ్ ఫ్రైడే వేడుకలు

రెవరెండ్ ఫాదర్ కస్పారెడ్డి

సూర్యాపేట జిల్లా ప్రేమ కరుణ సహనంతో సర్వం సుసాధ్యం చేయవచ్చని నిరూపించిన ఏకైక వ్యక్తి యేసు ప్రభువు అని సూర్యాపేట ఆర్సీఎం చర్చ్ ఫాదర్ రెవరెండ్ కస్పారెడ్డి పేర్కొన్నారు. పరిశుద్ధ శుక్రవారం (గుడ్ ఫ్రైడే) సందర్భంగా శుక్రవారం సూర్యాపేట లోని నిర్మల చర్చి ఆధ్వర్యంలో సిలువ దారి ఏసుక్రీస్తు చివరి రోజులను నాటక రూపంగా ప్రదర్శించారు. ఈ సందర్భంగా సూర్యాపేట పట్టణంలోని నిర్మల చర్చ వద్ద ప్రారంభమైన పరిశుద్ధ సిలువ మార్గం కార్యక్రమం అంబేద్కర్ బొమ్మ, శంకర్ విలాస్, గాంధీ బొమ్మ, ఆకారపు సుదర్శన్ బొమ్మ నుండి నిర్మల ఆసుపత్రిలోని కల్వరికొండ వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా యేసుక్రీస్తు మరణానికి సంబంధించిన 14 గుర్తులను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా కస్పారెడ్డి మాట్లాడుతూ... ప్రపంచ మానవాళిని పాపముల నుండి విముక్తులు చేసేందుకు క్రీస్తు ప్రభువు సిలువపై మరణం పొందాడని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు పాపాల నుండి విముక్తులు కావాలని సూచించారు. ఏసుప్రభువు కల్మషం లేకుండా జీవించి శారీరకంగా మరణించినా తిరిగి పునరుత్థానుడయ్యారని తెలిపారు. ప్రజలు యేసు ప్రభువు చూపిన మార్గంలో పయనిస్తూ తోటి వారి పట్ల ప్రేమానురాగాలను కలిగి, క్షమాగుణం ఆప్యాయత అనురాగాలను కలిగి ఉండాలన్నారు. చెడు వ్యసనాలను త్యజించి ప్రభు చూపించిన సన్మార్గం మార్గంలో నడవాలని ఆకాంక్షించారు. అనంతరం సాయంత్రం ఆర్.సి.యం చర్చిలో సిలువ ముద్దు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇతర ఫాదర్ లు, నిర్మల సిస్టర్స్, ఏ వి యం సిస్టర్స్, కాన్సిల్ మెంబెర్స్ ముక్కలా మర్రెడ్డి, వల్లమల్ల బాలాస్వామి, పిండిగ అజయ్, నాగటి ఏసుదాసు, బంధ శ్యాంసన్, పట్టేటి బాలశౌరి, పాండురంగీ బాలరాజు, గోపికిరణ్, కతోలిక విశ్వాసులు, తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రేమ కరుణతో సర్వం సుసాధ్యం

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News