Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:09 PM

పర్యావరణహిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

11-02-2026 310 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ పురపాలక పరిధిలోని లింగోజిగూడెం లో ఏర్పాటు చేసిన పర్యావరణహిత పోలింగ్ కేంద్రం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది జిల్లా కలెక్టర్ వి హనుమంతరావు మంగళవారం కేంద్రాన్ని సందర్శించి ఏర్పాట్లను సమగ్రంగా పరిశీలించారు. హరిత వాతావరణంలో ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకునేలా చేసిన చర్యలను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికలు ప్రజాస్వామ్య పండుగ మాత్రమే కాకుండా పర్యావరణానికి మేలు చేసే విధంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఈ వినూత్న ప్రయోగం చేపట్టామని తెలిపారు. ప్లాస్టిక్ రహిత వాతావరణం కాగితం వస్త్ర బ్యానర్లు, జూటు సంచుల వినియోగం, తాగునీటి కోసం మట్టి కుండలు ఏర్పాటు వంటి చర్యలు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇలాంటి హరిత చర్యలు అమలు చేయాలని దిశగా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కేంద్రం ప్రాంగణంలో మొక్కలు నాటడం, ఓటర్లకు నీడనిచ్చేలా పచ్చ కవచాలు ఏర్పాటు చేయడం, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించే పోస్టర్లు ప్రదర్శించడం విశేషంగా నిలిచాయి.

ప్రజాస్వామ్య పండుగకు పచ్చని పరిమళం..

ఓటర్లకు గ్రీన్ మెసేజ్ అందేలా ప్రత్యేకంగా అలంకరించడం ఆకట్టుకుందని పేర్కొన్నారు. మహిళలు, వృద్ధులు, దివ్యాంగుల కోసం ఏర్పాటుచేసిన ప్రత్యేక సదుపాయాలను కలెక్టర్ పరిశీలించారు. వీల్ చైర్లు, రాంపులు, ప్రత్యేక క్యూ లైన్లు, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి ప్రదేశం వంటి ఏర్పాట్లను ప్రశంసించారు. సిబ్బంది సమయపాలన, ఓటర్లకు అందిస్తున్న సహకారం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. పర్యావరణహిత ఏర్పాట్లపై ఓటర్లు కూడా సానుకూలంగా స్పందించారు. ఇలాంటి కేంద్రాల్లో ఓటు వేయడం ఆనందంగా ఉందని తెలిపారు. ప్రజాస్వామ్య పండుగకు పచ్చని పరిమళం అద్దిన ఈ వినూత్న ప్రయత్నం చౌటుప్పల్ ఎన్నికలకు ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఓటు హక్కుతో పాటు ప్రకృతి పరిరక్షణ బాధ్యతను గుర్తుచేసిన ఈ చర్య రాష్ట్రవ్యాప్తంగా ఆదర్శంగా నిలుస్తుందని కలెక్టర్ వి. హనుమంతరావు పేర్కొన్నారు.

Sthanikam

పర్యావరణహిత పోలింగ్ కేంద్రాన్ని సందర్శించిన కలెక్టర్

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News