Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అర్హులందరికీ సంక్షేమ పథకాల ఫలాలు అందించాలి. మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ రేఖ బాబురావు. ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 12:24 PM

ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్

ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్

ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్
26-01-2026 137 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

స్థానికం ప్రతినిధి కొమిడాల మహేందర్ రెడ్డి.

యాదాద్రి భువనగిరి జిల్లాలో విషాద ఘటన – 50 మంది ప్రాణాలు కాపాడిన బస్సు డ్రైవర్

యాదాద్రి భువనగిరి జిల్లాలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్ మియాపూర్ నుంచి విజయవాడకు వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ బస్సు డ్రైవర్ హార్ట్ స్ట్రోక్‌తో మృతి చెందాడు. అయితే, చివరి క్షణాల వరకూ తన ప్రాణాల కంటే బస్సులో ప్రయాణిస్తున్న 50 మంది ప్రయాణికుల భద్రతకే ప్రాధాన్యం ఇచ్చి మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచాడు.

బస్సు అబ్దుల్లాపూర్ మెట్ ప్రాంతానికి చేరుకున్న సమయంలో డ్రైవర్‌కు ఛాతిలో నొప్పి ప్రారంభమైంది. సాధారణ నొప్పి అని భావించిన ఆయన బస్సును చౌటుప్పల్ వరకు నడిపించాడు. నొప్పి తీవ్రత పెరగడంతో హార్ట్ స్ట్రోక్‌గా గుర్తించాడు. ఆ సమయంలో హైదరాబాద్‌లోని ఆస్పత్రికి వెళ్లాలంటే సుమారు 30 కిలోమీటర్ల దూరం ఉండటంతో, ప్రయాణికుల భద్రత దృష్ట్యా బస్సును వెనక్కి తీసుకెళ్లే సాహసం చేయలేదు.

చౌటుప్పల్ వద్ద బస్సును సురక్షితంగా నిలిపివేసి, సమీపంలోని ఆస్పత్రికి వెళ్లిన వెంటనే ఆయన కుప్పకూలిపోయాడు. అప్పటికే డ్రైవర్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడిని విజయవాడకు చెందిన నాగరాజుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు కుటుంబ సభ్యులకు తెలియజేశారు.

డ్రైవర్ అత్యవసర పరిస్థితిలో బస్సును అధిక వేగంతో నడిపి ఉంటే భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉండేదని ప్రయాణికులు పేర్కొన్నారు. తన ప్రాణాలు కోల్పోయినా, 50 మంది ప్రయాణికుల ప్రాణాలు కాపాడిన నాగరాజు త్యాగం ప్రశంసనీయం అని స్థానికులు, ప్రయాణికులు భావవ్యక్తం చేస్తున్నారు.

Sthanikam

ప్రయాణికులను కాపాడిన బస్సు డ్రైవర్

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News