Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 09:57 AM

ప్రయాణికుల భద్రతే ప్రధాన బాధ్యత

ప్రయాణికుల భద్రతే ప్రధాన బాధ్యత

ప్రయాణికుల భద్రతే ప్రధాన బాధ్యత
26-03-2026 19 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

ట్యాక్సీ, ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రతపై అవగాహన కార్యక్రమం

సూర్యాపేట పట్టణం: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహిస్తూ సూర్యాపేట ట్రాఫిక్ పోలీసులు పట్టణంలోని న్యూ బస్టాండ్ ఆటో స్టాండ్ వద్ద ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాహనాలు నడిపే విధానం, ప్రయాణికుల భద్రతపై అనుసరించాల్సిన నియమాలను వివరించారు.

పట్టణ పరిశీలకుడు వెంకటయ్య మాట్లాడుతూ ప్రయాణికులను సురక్షితంగా గమ్యానికి చేర్చడం ప్రతి డ్రైవర్ బాధ్యత అని తెలిపారు. వాహనాలను నిదానంగా నడపాలని, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించవద్దని సూచించారు. ప్రయాణికులు వాహనాల్లో వస్తువులు మర్చిపోతే వాటిని తిరిగి అందజేయాలని లేదా పోలీసులకు సమాచారం ఇవ్వాలని చెప్పారు. ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని సూచించారు.

ట్రాఫిక్ ఉప పరిశీలకుడు సాయిరాం మాట్లాడుతూ రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని, జాగ్రత్తగా వాహనాలు నడిపి ప్రమాదాలను నివారించాలని కోరారు. నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ పోలీసులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

Sthanikam

ప్రయాణికుల భద్రతే ప్రధాన బాధ్యత

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News