Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నల్గొండలో మెడ్‌ప్లస్ మెడికల్ షాపు ప్రారంభం. ప్రజలకు నాణ్యమైన మందులు అందుబాటు ధరల్లో అందిస్తాం: నిర్వాహకులు నాణ్యత లేని భోజనం – అధికారుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు వినతి పత్రం:- RSF,AISU విద్యార్థి సంఘాలు మహిళలు, చిన్నారుల భద్రతపై శక్తి టీమ్‌ల విస్తృత అవగాహన నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 01:19 AM

ప్రతిభకు పట్టం.. 26 మంది విద్యార్థులకు ఘన సన్మానం

ప్రతిభకు పట్టం.. 26 మంది విద్యార్థులకు ఘన సన్మానం

ప్రతిభకు పట్టం.. 26 మంది విద్యార్థులకు ఘన సన్మానం
June 07, 2026 08:02 PM 18 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణపేట, ప్రభుత్వ పాఠశాలల్లో పదో తరగతి పరీక్షల్లో తమ తమ పాఠశాలల్లో ప్రథమ స్థానం సాధించిన 26 మంది విద్యార్థులను గుడిసె ఆది కృష్ణమ్మ సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మెమెంటోలు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను బహుమతులుగా అందజేసి శాలువాలతో సత్కరించారు.

కార్యక్రమంలో పాల్గొన్న గుడిసె ఆది కృష్ణమ్మ మాట్లాడుతూ పేదరికం విజయానికి అడ్డంకి కాదని, పట్టుదల, కష్టపడే తత్వమే విజయానికి అసలైన చిరునామా అని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు కూడా అత్యున్నత లక్ష్యాలను చేరుకోగలరని ఈ విద్యార్థులు నిరూపించారని పేర్కొన్నారు. నేటి విద్యార్థులే రేపటి దేశ నిర్మాతలని, మరిన్ని ఉన్నత లక్ష్యాలను సాధించి తల్లిదండ్రులు, పాఠశాలలు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడం అంటే సమాజ భవిష్యత్తులో పెట్టుబడి పెట్టడమేనని ఆమె అన్నారు. విద్యార్థుల విజయాలు కుటుంబాలకు గర్వకారణమే కాకుండా సమాజానికి స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు ఉమాపతి నాయుడు, భాస్కర్‌రెడ్డి, హౌసింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ రామకృష్ణ, బెస్త కార్పొరేషన్ డైరెక్టర్ రామంజి, గుడిసె శ్రీరాములు, బీజేపీ నాయకులు బిడ్డ రమేష్, మధుసూదన్ శర్మ, శ్రీకాంత్‌రెడ్డి, వేణుగోపాల్‌రెడ్డి, రామస్వామి, మాధవ్‌, బుద్ధారెడ్డి, వాల్మీకి సంఘం నాయకులు రాంబీం నాయుడు, ఉరుకుంద ట్రస్ట్ బోర్డు సభ్యుడు రంగస్వామి, మనోహర్‌, లక్ష్మీకాంత్‌, మాజీ ఎంపీపీ మురళి, మల్లికార్జున, మల్లయ్య, బజారప్ప, మహదేవ్‌, వెంకటేష్‌, ఓంకార్‌, రాఘవరెడ్డి, భరత్‌, వీరేష్‌తో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News