Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
కురుమర్తిలో 100 ఎకరాల్లో ఎండిన పంటలు! ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 01:21 PM

ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి

ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి

ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి
02-02-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి మండలం చిన్ననారాయనపురం గ్రామానికి చెందిన సోషల్ వెల్ఫేర్ గురుకుల బాలికల పాఠశాల & జూనియర్ కళాశాలలో 6వ తరగతి చదువుతున్న విద్యార్థిని కొమ్ము రేణుశ్రీ తన పుట్టినరోజును సామాజిక బాధ్యతతో జరుపుకున్నారు.

సమాజంలో రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించి, అందరికీ సంపూర్ణ ఆరోగ్యం అందించాలనే సంకల్పంతో ఆమె తన పుట్టినరోజు సందర్భంగా ఒక పూల మొక్కను పాఠశాల ఆవరణలో నాటారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ శమంతకమణి, PET జ్యోతి, తల్లిదండ్రులు కొమ్ము యాదగిరి – రమణలు పాల్గొని విద్యార్థినిని అభినందించారు.

ఈ సందర్భంగా రేణుశ్రీ మాట్లాడుతూ, “ప్రతి ఒక్కరూ తమ పుట్టినరోజు సందర్భంగా కనీసం ఒక మొక్కను నాటితే సమాజం మరింత అందంగా, ఆరోగ్యంగా మారుతుంది” అని తెలిపారు. తన పుట్టినరోజును పర్యావరణ పరిరక్షణకు అంకితం చేయడం తనకు ఎంతో సంతృప్తినిస్తోందని అన్నారు.

విద్యార్థిని చేసిన ఈ చక్కటి కార్యక్రమం అందరికీ ఆదర్శంగా నిలుస్తోందని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రశంసించారు.

Sthanikam

ప్రతి పుట్టినరోజుకు ఒక మొక్కను నాటాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News