Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు సబ్ స్టేషన్ ముట్టడి: బీఆర్ఎస్ అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! బీసీ మహిళలకు బంపర్ అవకాశం.. కుట్టు మెషీన్ దరఖాస్తు గడువు పొడిగింపు సెప్టెంబర్ 30వ హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన న్యాల్కల్‌లో శ్రావణ మాసం చివరి సోమవారం.. రామలింగేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ అక్షరమే ఆయుధం… గురువే దారిచూపే దీపం! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 22, 2026 01:07 AM

ప్రతి గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా లక్ష్యంగా అధికారులు పనిచేయాలి : కలెక్టర్

28-04-2026 115 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో జిల్లాలో ఎక్కడా తాగునీటి కొరత తలెత్తకుండా అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఆదేశించారు. ప్రతి గ్రామం, ప్రతి నివాస ప్రాంతానికి నిరంతరాయంగా తాగునీరు అందేలా ప్రత్యేక పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. మంగళవారం నారాయణఖేడ్ నియోజకవర్గ పరిధిలోని మండలాల ఎంపీడీవోలు, హౌసింగ్, ఆర్‌డబ్ల్యూఎస్, ఎంపీఓలు, మున్సిపల్, విద్యుత్ తదితర శాఖల అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. ఈ సందర్భంగా మంచినీటి సరఫరా, ఇందిరమ్మ ఇండ్లు, పారిశుధ్యం, సాదా బైనామాలు, భూభారతి దరఖాస్తుల పరిష్కారం వంటి అంశాలపై సమగ్రంగా చర్చించారు. మండలాల వారీగా గ్రామాల్లో నీటి సరఫరా పరిస్థితి, అందుబాటులో ఉన్న వనరులు, మరమ్మతులు అవసరమైన పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత వేసవిలో సమస్యలు ఎదురైన ప్రాంతాలను గుర్తించి ఈసారి ముందుగానే చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి చుక్క నీటిని సద్వినియోగం చేసుకోవాలని, ఎక్కడైనా సమస్యలు తలెత్తితే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువచ్చి యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామ పంచాయతీలలో పారిశుధ్య కార్యక్రమాలు సక్రమంగా అమలు కావాలని, ప్రతి గ్రామ పంచాయతీ పరిధి స్పష్టంగా తెలిసేలా సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాన్ని వేగవంతం చేసి లబ్ధిదారులను ప్రోత్సహిస్తూ పనులు త్వరగా పూర్తి చేయించాలని, బిల్లులు ఆలస్యం లేకుండా చెల్లించేలా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ అధికారులకు ఆదేశించారు. సాదా బైనామాలు, భూభారతి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. విద్యుత్ శాఖకు సంబంధించి లో వోల్టేజ్, ట్రాన్స్‌ఫార్మర్లు, లైన్ల మరమ్మతుల వంటి సమస్యలను 15 రోజుల్లోగా పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు సమన్వయంతో పని చేసి ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూడాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ సమావేశంలో నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమా హారతి, మున్సిపల్ కమిషనర్, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఎంపీఓలు, విద్యుత్, హౌసింగ్, మిషన్ భగీరథ తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రతి గ్రామానికి నిరంతర తాగునీటి సరఫరా లక్ష్యంగా అధికారులు పనిచేయాలి : కలెక్టర్

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News