Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బాధితులను పరామర్శించేందుకూ అడ్డంకులా?. “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 01:18 PM

ప్రత్యేక దైవ సందేశాలతో బోడగమ్మలో మూడు రోజుల మహాసభలు

17-02-2026 40 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం పరిధిలోని బోడగమ్మ (బోరేగావ్) గ్రామం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడుతోంది. ఫిబ్రవరి 18 నుంచి 20వ తేదీ వరకు మూడు రోజుల పాటు యేసుక్రీస్తు రక్షణ సువార్త మహాసభలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బోరేగావ్ క్రైస్తవ సహోదరుల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభలు ఈ సంవత్సరం 11వ వార్షికోత్సవంగా నిర్వహించబడుతున్నాయి.40 రోజుల ఉపవాస ప్రార్థనల సమాప్తి సందర్భంగా ప్రత్యేక ఆత్మీయ జాగరణతో ఈ మహాసభలను నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. గ్రామ ప్రజలతో పాటు పరిసర ప్రాంతాల విశ్వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా విస్తృత ఏర్పాట్లు చేపట్టారు. ప్రతిరోజూ సాయంత్రం 5 గంటల నుంచి దైవ సందేశాలు, ఆత్మీయ గీతాలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించబడతాయి.ఈ మహాసభలకు ప్రముఖ దైవజనులు ముఖ్య వక్తలుగా హాజరవుతున్నారు. ఏలూరు జిల్లా పెదలంక హోలీ చర్చి నుండి కె. జాన్ మంగాచార్యులు, హైదరాబాద్‌లోని రాజా ఫెయిత్ మినిస్ట్రీస్ వ్యవస్థాపకులు రాజా హేబెల్, బ్రిమ్–ట్రూ వర్డ్ సెంటర్‌కు చెందిన కె.ఆర్. జాన్ తమ ఆత్మీయ సందేశాలతో సభను ఆశీర్వదించనున్నారు. వారి సందేశాలు విశ్వాసులకు ఆత్మబలాన్ని, నూతన ఆశను కలిగిస్తాయని నిర్వాహకులు తెలిపారు.బ్రదర్ కె. ప్రశాంత్ మరియు సిస్టర్ ఝాన్సీరాణి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ మహాసభలకు గ్రామ ప్రజలు, యువత, మహిళలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని నిర్వాహకులు పిలుపునిచ్చారు. సభకు విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేకంగా ప్రేమవిందు భోజన సదుపాయాన్ని కూడా ఏర్పాటు చేశారు.ఆధ్యాత్మిక పరిపూర్ణత, శాంతి, ఆశీర్వాదాలను పొందేందుకు ఈ సువార్త మహాసభలు మంచి అవకాశంగా నిలుస్తాయని నిర్వాహకులు పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9618171506, 9515303863, 9346362942 నంబర్లను సంప్రదించవచ్చు.

Sthanikam

ప్రత్యేక దైవ సందేశాలతో బోడగమ్మలో మూడు రోజుల మహాసభలు

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News