Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పర్షియన్ పిల్లి ‘లియో’ అదృశ్యం.. ఆచూకీ తెలిపితే రూ.10 వేల బహుమతి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 29, 2026 11:37 AM

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ
12-02-2026 60 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ .

సూర్యాపేట, హుజూర్నగర్, కోదాడ, తిరుమలగిరి, నేరేడుచర్లమున్సిపాలిటీలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో కొనసాగు తున్నట్లు జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.

బుధవారం సూర్యాపేట మున్సిపాలిటీ పరిధిలో జడ్పి ఉన్నత పాఠశాల, ఆనంద్ విద్యా మందిర్ హై స్కూల్, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, తేజ్ హై స్కూల్, చుక్కారామయ్య హై స్కూల్, కుడకుడలోని ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను జిల్లా ఎన్నికల అధికారి సందర్శించి ఏర్పాట్లు, ఓటింగ్ విధానాన్ని పరిశీలించారు. పోలింగ్ సిబ్బందికి అవసరమైన సూచనలు ఇచ్చి, ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.అనంతరం సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సముదాయ సమావేశం మందిరంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌ను సందర్శించి వెబ్‌కాస్టింగ్ ప్రక్రియను పరిశీలించారు.పోలింగ్ ప్రక్రియ పారదర్శకంగా, ఎలాంటి అంతరాయాలు లేకుండా కొనసాగుతున్నదని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు. ఎన్నికలు స్వేచ్ఛా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆయన వెల్లడించారు.ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, తహసీల్దార్ కృష్ణయ్య, ఎన్నికల సిబ్బంది ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ప్రక్రియ

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News