Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రేషన్ కార్డుదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 02:12 PM

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం – కలెక్టర్ హనుమంత రావు

10-02-2026 45 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మున్సిపల్ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు

ప్రశాంతంగా పోలింగ్ నిర్వహించాలి

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 11న జరిగే పోలింగ్ ప్రక్రియను సజావుగా, ప్రశాంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హనుమంత రావు సూచించారు. పోలింగ్ ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని అధికారులకు ఆదేశించారు.మంగళవారం చౌటుప్పల్, పోచంపల్లిలో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కలెక్టర్ సందర్శించారు. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ నిర్వహణ కోసం సిబ్బందికి ఎన్నికల సామాగ్రి పంపిణీ ప్రక్రియను, భోజన వసతులు, ఇతర ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు.

డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలలో సిబ్బందికి మౌలిక సదుపాయాలు తప్పనిసరిగా కల్పించాలని తెలిపారు. లైటింగ్, త్రాగునీరు, లంచ్, డిన్నర్ ఏర్పాట్లు సమర్థవంతంగా ఉండాలని, పోలింగ్ సిబ్బందిని బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో పోలింగ్ కేంద్రాలకు ఎస్కార్ట్ వాహనాల ద్వారా తరలించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు సరిగా ఉన్నాయా లేవా అని ముందుగా పరిశీలించి మాత్రమే సిబ్బందికి అప్పగించాలని తెలిపారు.జిల్లాలోని ఆరు మున్సిపాలిటీల్లో పకడ్బందీగా పోలింగ్ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ వెల్లడించారు. పోలింగ్ సిబ్బంది కూడా తమకు కేటాయించిన సామగ్రిని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలోనే పూర్తిగా పరిశీలించి జాగ్రత్తగా పోలింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలని సూచించారు.

పోలింగ్ ప్రక్రియ రేపు ఉదయం 7 గంటలకు ప్రారంభించాల్సిందిగా తెలిపారు. ఈరోజు రాత్రికే అన్ని పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. ఓటర్లు కూడా ఉదయమే పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికల్లో జిల్లాలో వంద శాతం ఓటింగ్ నమోదు కావాలని ఆకాంక్షించారు.

ప్రతి పోలింగ్ స్టేషన్‌లో జరుగుతున్న పోలింగ్ తీరును నిశితంగా పరిశీలించాలని, ఏవైనా సమస్యలు తలెత్తితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు తదితర అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రశాంత ఎన్నికలే లక్ష్యం – కలెక్టర్ హనుమంత రావు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News