Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: February 23, 2026 08:41 PM

ప్రశ్నించే గొంతు సలీం గెలిపించండి- కాంగ్రెస్ బిజెపిలను ఓడించండి:  సయ్యద్ హశం

ప్రశ్నించే గొంతు సలీం గెలిపించండి- కాంగ్రెస్ బిజెపిలను ఓడించండి:  సయ్యద్ హశం

ప్రశ్నించే గొంతు సలీం గెలిపించండి- కాంగ్రెస్ బిజెపిలను ఓడించండి:  సయ్యద్ హశం
January 31, 2026 03:51 PM 10 Views
Reporter
స్థానికం ప్రతినిధి : NALGONDA DISTRICT
సీనియర్ జర్నలిస్ట్ డి.డి.దాసు

ప్రశ్నించే గొంతు సలీం గెలిపించండి- కాంగ్రెస్ బిజెపిలను ఓడించండి: సయ్యద్ హశం

నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎండీ సలీం ను 20 డివిజన్ కార్పొరేటర్ గా గెలిపించాలని పట్టణంలో కాంగ్రెస్ ,బిజెపి అభ్యర్థులను ఓడించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హాశం పిలుపునిచ్చారు.శుక్రవారం దొడ్డి కొమరయ్య భవన్లో సిపిఎం పట్టణ విస్తృతస్థాయి సమావేశం తుమ్మల పద్మ అధ్యక్షతన జరిగింది. ముఖ్యఅతిథిగా హాజరైన హాశం మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు దాటిన ఇచ్చిన హామీలు ఒకటి అమలు చేయలేదని ఆరోపించారు పట్టణ అభివృద్ధికి నష్టం కలిగించే విధంగా 565 జాతీయ రహదారి బైపాస్ రోడ్డుని నల్గొండ నడి పట్టణం నుండి తీసుకుపోవడం కాంగ్రెస్ నిర్వాకమేనని అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వంలో నిర్మించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లు లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రోసిడింగ్ ఆర్డర్స్ ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వివరించడమే కాకుండా అర్హుహైన పేదలను తొలగించి డబ్బులకు అమ్ముకున్న కాంగ్రెస్ పార్టీని ఓడించాలని పిలుపునిచ్చారు రోడ్డు భవనాల శాఖ మంత్రిగా ఉండి రెండు సంవత్సరాలైనా శంకుస్థాపనలే తప్ప పనులు పూర్తి కాలేదని ఆరోపించారు కాంగ్రెస్ ఏకపక్ష విధానాలకు వ్యతిరేకంగా నిరంతరం ప్రజా సమస్యలపై పోరాడుతున్న 20 వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి యం డి సలీం ను గెలిపించాలని పిలుపునిచ్చారు.సిపిఎం పట్టణ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మాట్లాడుతూ నల్లగొండ పట్టణ అభివృద్ధికి కోట్ల రూపాయలు నిధులు కేటాయించి అభివృద్ధి చేసిన టిఆర్ఎస్, సిపిఎం లు కార్పొరేషన్ ఎన్నికల్లో కలిసి పనిచేస్తూ హామీలు తప్ప అమలు చేయని కాంగ్రెస్ ను కార్మిక హక్కులను కాలరాస్తూ తెచ్చిన నాలుగు లేబర్ కోడ్ లకు , ఉపాధి హామీ చట్టాన్ని పరోక్షంగా రద్దుకు చట్టం పేరు మార్చిన కేంద్ర బిజెపి ని నల్లగొండ కార్పొరేషన్ ఎన్నికల్లో ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతుక కార్మిక నాయకుడు 20వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి కామ్రేడ్ ఎండి సలీం ను గెలిపించాలని పిలుపునిచ్చారు.

     ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు 20 డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థి ఎండి సలీం, జిల్లా సీనియర్ నాయకులు ఉట్కూరి నారాయణరెడ్డి పట్టణ కమిటీ సభ్యులు అవుట రవీందర్ దండెంపల్లి సరోజ, అద్దంకి నరసింహ ఆకిటి లింగమ్మ ఊట్కూరి మధుసూదన్ రెడ్డి గుండాల నరేష్ , సలివోజు సైదాచారి సర్దార్ అలీ శాఖ కార్యదర్శిలు కారంపూడి రాము రుద్రాక్షి యాదయ్య పనస చంద్రయ్య రుద్రాక్షి రామచంద్రు సీత వెంకటయ్య బొమ్మ నాగరాజు ఎస్కే జానీ తదితరులు పాల్గొన్నారు.


మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News