Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 19, 2026 07:07 PM

ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు

ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఘనంగా ఉగాది వేడుకలు
March 19, 2026 05:16 PM 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : CHOUTUPPAL MANDAL
K.RAVI

ప్రత్యేక పూజలు, పంచాంగ శ్రవణం – హుండీ ఆదాయం రూ.33,395

పరాభవ నామ నూతన సంవత్సర ఉగాది పర్వదినం సందర్భంగా చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని లక్కారం గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.ఈ సందర్భంగా భక్తులకు ఉగాది పచ్చడి, భక్షాలు, పులిహోర, తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. అనంతరం పంచాంగ శ్రవణం కార్యక్రమం నిర్వహించగా, భక్తులు శ్రద్ధగా వినిపించారు.హుండీ లెక్కింపు కార్యక్రమంలో మొత్తం రూ.33,395 ఆదాయం వచ్చినట్లు కమిటీ సభ్యులు వెల్లడించారు.ఈ కార్యక్రమంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు కానుగు శేఖర్ గౌడ్, సలహాదారులు పాశం సంజయ్ బాబు, ధర్మకర్తలు పాశం రఘుపతి, లందగిరి భీమయ్య, ఆకుల ధర్మయ్య, లందగిరి వెంకటేశం, గౌరవ అధ్యక్షులు మునుకుంట్ల మల్లేశం, ఉపాధ్యక్షులు కుడుముల బసవ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మన్నెం శంకర్, కౌన్సిలర్స్ కాసర్ల మంజుల శ్రీనివాస్ రెడ్డి, బద్రి గాలయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఆకుల ఇంద్రసేనారెడ్డి, మాజీ సర్పంచ్ కానుగు యాదమ్మ బాలరాజు, మాజీ కౌన్సిలర్ కొయ్యడ సైదులు, పురోహితులు రాచకొండ భాస్కరాచారి,కమిటీ సభ్యులు లందగిరి అరుణ్ కుమార్, కానుగు ప్రవీణ్, కానుగు శంకర్, లందగిరి సాయికుమార్, పర్సనబోయిన నరేష్, పెద్దిరెడ్డి శ్రీనువాస్, పాశం లింగస్వామి, కానుగు సతీష్, లందగిరి వినయ్ కుమార్, గడగోటి మల్లేశం, గుండెబోయిన నరసింహ్మ, పాశం కృష్ణయ్య, గుండెబోయిన ఐలయ్య, భీమనగొని శ్రీను, సున్నపు మన్నెంకొండ, లందగిరి యాదయ్య, బత్తుల సత్తయ్య, పాశం లక్ష్మయ్య, నారగోని అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News