Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
గ్రాడ్యుయేట్ ఓటు నమోదు దరఖాస్తులు సమర్పించిన భరత్ బాబు ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 10:28 AM

ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు

26-01-2026 211 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Suryapet
Vikram Journalist

అమరవీరుల త్యాగఫలమే దేశానికి స్వాతంత్ర్యం: పంతంగి వీరస్వామి గౌడ్

సూర్యాపేట స్థానిక ప్రధాన ప్రతినిధి:

బ్రిటిష్ వలస పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడానికి జరిగిన స్వాతంత్ర్య సంగ్రామంలో అమరులైన వీరుల త్యాగఫలితంగానే భారతదేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిందని సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు, తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు పంతంగి వీరస్వామి గౌడ్ అన్నారు.

సోమవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ కార్యాలయంలో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశ స్వాతంత్ర్యం కోసం మహాత్మా గాంధీ, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ వంటి అనేక మంది మహనీయులు తమ ప్రాణాలను అర్పించి పోరాడారని గుర్తు చేశారు. 1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత, 1950 జనవరి 26న డా. బి.ఆర్. అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిందని, అదే దేశానికి విశిష్ట గుర్తింపును తీసుకువచ్చిందని తెలిపారు. భారత రాజ్యాంగం ద్వారానే దేశంలో చట్టబద్ధ పాలన కొనసాగుతోందని, రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు అయిందని పేర్కొన్నారు. భారతదేశం ఉన్నంతకాలం రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ పేరు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందని ఆయన అన్నారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసి గణతంత్ర దినోత్సవ వేడుకలను సంబరంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ పట్టణ అధ్యక్షుడు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారు దేవత్ కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా కోశాధికారి పాల సైదులు, జిల్లా ఉపాధ్యక్షుడు పర్వతం వెంకటాచారి, పట్టణ గౌరవ సలహాదారు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి, పట్టణ ప్రధాన కార్యదర్శి కొత్తపెళ్లి వెంకన్న, జిల్లా కార్యదర్శి సత్తిరెడ్డి, సభ్యులు బానోత్ జానీ నాయక్, జలగం లోకేష్, అనంతరెడ్డి, దస్తగిరి, ఆకుల మారయ్య గౌడ్, ఐతగాని మల్లయ్య గౌడ్, పట్టేటి కిరణ్, రమేష్, రాపర్తి జానయ్య గౌడ్, పెగపురం నర్సయ్య, లోకేష్, ఖమ్మం పాటి అంజయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచంలోనే భారత రాజ్యాంగానికి ప్రత్యేక గుర్తింపు

Article Image

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News