Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 07:18 AM

ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు

08-05-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తలసేమియా బాధిత చిన్నారులకు అండగా నిలవాలి : చింతకాయల రేఖ

నల్గొండ, : తలసేమియా వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంపొందించడం, బాధిత చిన్నారులకు అండగా నిలవడం తమ ముఖ్య ఉద్దేశ్యమని అమ్మ ఫౌండేషన్ ఫౌండర్ చింతకాయల రేఖ పేర్కొన్నారు. ప్రపంచ తలసేమియా దినోత్సవాన్ని పురస్కరించుకుని నల్గొండ ప్రభుత్వ జనరల్ మెడికల్ కాలేజీ, బ్లడ్ సెంటర్లలో తాసుబెల్లి ఫౌండేషన్, అమ్మ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులు నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తలసేమియా అనేది వంశపారంపర్య రక్త సంబంధిత వ్యాధి అని తెలిపారు. ఈ వ్యాధితో బాధపడుతున్న చిన్నారుల్లో ఎర్ర రక్త కణాలు సరిగా ఉత్పత్తి కాకపోవడంతో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గి తీవ్రమైన రక్తహీనత ఏర్పడుతుందని చెప్పారు. అలాంటి పిల్లలకు జీవితాంతం ప్రతి నెలా రక్త మార్పిడి అవసరమవుతుందని వివరించారు.

వివాహానికి ముందు దంపతులు “HbA2” అనే రక్త పరీక్ష చేయించుకుంటే పుట్టబోయే బిడ్డకు తలసేమియా రాకుండా ముందస్తుగా నివారించవచ్చని సూచించారు.

తలసేమియా వ్యాధిని 1925లో అమెరికాకు చెందిన శిశురోగ నిపుణులు డాక్టర్ థామస్ బెంటన్ కూలీ, డాక్టర్ పెరల్ లీ గుర్తించగా, 1932లో నోబెల్ బహుమతి గ్రహీతలు జార్జ్ విప్పల్, విలియం బ్రాడ్‌ఫోర్డ్ ఈ వ్యాధికి “తలసేమియా” అని పేరు పెట్టినట్లు తెలిపారు.

కార్యక్రమంలో డీఎంహెచ్‌వో సంపత్ మాట్లాడుతూ తలసేమియా చిన్నారుల కోసం తాసుబెల్లి ఫౌండేషన్, అమ్మ ఫౌండేషన్ చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ సంస్థలు చేపడుతున్న సేవా కార్యక్రమాలు చిరస్థాయిగా నిలిచిపోతాయని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో తాసుబెల్లి ఫౌండేషన్ చైర్మన్ శంకర్ నాయుడు, గోపరాజు శ్రీనివాస్, సౌబిండి వెంకటలక్ష్మి, సాయి సేవా ట్రస్ట్ ఫౌండర్ దాసరి సాయి, కో-ఫౌండర్ బలికే రాకేష్ కుమార్, అమ్మ ఫౌండేషన్ సభ్యుడు సురేష్, ఐసిటీసీ కౌన్సిలర్ లింగస్వామి, ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రపంచ తలసేమియా దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News