Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
డివైఎఫ్ఐ రాష్ట్ర మహాసభలకు సన్నద్ధం కావాలి ప్రజాపాలనకు ఆయువుపట్టు: 'సమాచార హక్కు చట్టం - 2005' సుదీర్ఘ ప్రస్థానం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 15, 2026 04:57 PM

ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి

08-12-2025 175 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర కార్యదర్శి ఆనందాచారి

స్థానిక ప్రతినిధి కొండ మల్లేశం గౌడ్

నేడు ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ ల పేరుతో మానవ సంబంధాల మధ్య జరిగే విద్వేషాలను నిరోధించుటకు "తెలంగాణ సాహితీ సంస్థ" కృషి చేయాలని తెలంగాణ సాహితీ సంస్థ రాష్ట్ర కార్యదర్శి కె ఆనందాచారి కోరారు. ఆదివారం భువనగిరి పట్టణ శివారులోని తెలంగాణ హోటల్ లో జరిగిన యాదాద్రి భువనగిరి జిల్లా "తెలంగాణ సాహితీ సంస్థ ఆవిర్భావ" సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నేటి పాలకులు దేశంలో ప్రపంచీకరణ, గ్లోబలైజేషన్ పేరుతో మన సంస్కృతి, సాంప్రదాయాలు, పండుగలు , తినే తిండిని మార్చివేసి , వస్తువుల వినిమయం పెంచారని ఆయన అన్నారు. ప్రపంచీకరణ అనేది పేదవాన్ని దోచుకోవడానికి, కార్పొరేట్ సంస్థలను బలోపేతం చేయడానికే ఉపయోగపడుతున్నాయని ఆయన అన్నారు. పాలకులు సనాతన ధర్మం పేరుతో అంటరానితనం , అస్పృశ్యత ను పెంచి పోషించాలని చూస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్పొరేట్ సంస్థల కారణంగా నేటి యువత ఉద్యోగం, భద్రత కోసం రోజుకు 14 గంటలు పని చేస్తున్నారని, ఇలాంటి శ్రమ దోపిడీ , విష సంసృతి, సాంప్రదాయాలు మారాలని, కవులు కళాకారులు, రచయితలు, సాహితీవేత్తలు, సామాజిక కార్యకర్తలు కృషి చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో తెలంగాణ సాహితీ యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ బాధ్యులు జిట్టా భాస్కర్ రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా అధ్యక్షులు గోవర్థన్, సభ్యులు ఏభూషి నర్సింహ, మధు మోహన్, హనుమంతు, కొడారి వెంకటేష్, ముత్తి రెడ్డి, వెంకన్న , ఉప్పలయ్య, రాజేందర్, నాగభూషణం , ముత్యాలు, రాజు తదితరులు పాల్గొన్నారు

Sthanikam

ప్రపంచీకరణ పేరుతో జరిగే విధ్వంసాన్ని ఆపాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News