Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఇస్రోలోకి కుడకుడ యువకెరటం..! నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి ప్రజా సంక్షేమ పాలనకు వైఎస్సార్‌ నిదర్శనం.. సీఎం నివాళులు ఒప్పందములు హక్కులు–బాధ్యతలను స్పష్టంగా నిర్ణయించే చట్టబద్ధమైన పత్రం రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 05, 2026 02:57 AM

ప్రాణం తీయకండి.. బాధ్యతగా వాహనం నడవండి!

ప్రాణం తీయకండి.. బాధ్యతగా వాహనం నడవండి!

ప్రాణం తీయకండి.. బాధ్యతగా వాహనం నడవండి!
06-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రతినిధి : District Bureau Nalagonda
NM Yadav

నిర్లక్ష్యపు డ్రైవింగ్‌పై ఎస్పీ శరత్ చంద్ర పవార్ సీరియస్.. లారీ డ్రైవర్లకు ప్రత్యేక సూచనలు

నల్లగొండ : రోడ్డుపై వాహనం నడిపేటప్పుడు డ్రైవర్లు వహించే చిన్నపాటి నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగులుస్తుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఐపీఎస్ ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో భారీ వాహనాల కారణంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టే లక్ష్యంతో బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో లారీ అసోసియేషన్ ప్రతినిధులు, ట్రాన్స్‌పోర్ట్ యాజమాన్యం మరియు డ్రైవర్లతో ప్రత్యేక అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ..

ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో అధిక శాతం అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, అలసట వల్లనే సంభవిస్తున్నాయని గుర్తుచేశారు. ముఖ్యంగా భారీ వాహనాల వల్ల జరిగే ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని అందుకే డ్రైవర్లు 'డిఫెన్సివ్ డ్రైవింగ్' అలవాటు చేసుకోవాలని సూచించారు. ఎదుటి వాహనదారులు చేసే పొరపాట్లను కూడా ముందుగానే అంచనా వేసి అప్రమత్తంగా వ్యవహరించడమే ఉత్తమమని పేర్కొన్నారు. ప్రతి డ్రైవర్ ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటిస్తూ క్రమశిక్షణతో వాహనాలు నడపాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఎడమ వైపు నుండి ఓవర్‌టేక్ చేయకూడదని ఎస్పీ ఆదేశించారు. వాహనం ఏవైనా సాంకేతిక సమస్యల వల్ల రోడ్డుపై నిలిచిపోయినప్పుడు ఇతర వాహనదారులకు ప్రమాదం కలగకుండా తప్పనిసరిగా రిఫ్లెక్టర్ స్టిక్కర్లు, ట్రాఫిక్ కోన్స్ మరియు ఇండికేటర్లను ఉపయోగించాలని చెప్పారు. అత్యవసర పరిస్థితుల్లో జాతీయ రహదారి టోల్ ఫ్రీ నంబర్ 1033 కు కాల్ చేసి సహాయం పొందవచ్చని సూచించారు. డ్రైవర్లు నిరంతరాయంగా వాహనం నడపకుండా ప్రతి రెండు గంటలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలని ప్రయాణం ప్రారంభించే ముందే బ్రేకులు, టైర్లు మరియు లైట్లను క్షుణ్ణంగా తనిఖీ చేసుకోవాలని తెలిపారు. పట్టణంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ ప్రకటించారు. ఉదయం 8 గంటల నుండి 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుండి 8 గంటల వరకు మాత్రమే భారీ వాహనాలను అనుమతిస్తామని నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం లేదా అనధికారిక పార్కింగ్ వంటి కేసుల్లో లైసెన్సుల రద్దుతో పాటు వాహనాల సీజ్ వంటి చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. మరోవైపు, రోడ్డు ప్రమాద బాధితులను కాపాడటం ప్రతి పౌరుడి బాధ్యతని గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించే వారికి 'రహవీర్ పథకం' కింద రూ. 25 వేల నుండి రూ. లక్ష వరకు ప్రోత్సాహక నగదు అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, ఎస్బీ సీఐ ఆదిరెడ్డి, ట్రాఫిక్ సీఐ మహాలక్ష్మయ్య, లారీ అసోసియేషన్ ప్రతినిధులు చాంద్ పాషా, రవీందర్ రావు మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రాణం తీయకండి.. బాధ్యతగా వాహనం నడవండి!

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News