Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:06 PM

ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి వ్యక్తి మృతి

04-02-2026 522 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

వాటర్ బాటిల్ అనుకొని కెమికల్ సేవించి వ్యక్తి మృతి చెందిన ఘటన చౌటుప్పల్ మండలం ఎల్లగిరి గ్రామంలో చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చౌటుప్పల్ మండలం కైతాపురం గ్రామానికి చెందిన గుడ్డేటి రవి (43) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి మృతి చెందాడు. ఖాళీగా ఉన్న సమయంలో మండల పరిధిలోని ఎల్లగిరి గ్రామంలోని కోళ్ల ఫారం షెడ్ లో రాత్రి డ్యూటీకి వెళ్లే రవి.మంగళవారం రాత్రి కూడా విధులకు హాజరయ్యాడు. బుధవారం తెల్లవారుజామున నిద్రలేచి వాటర్ బాటిల్ అనుకొని 'సర్మోలిన్' అనే కెమికల్ ద్రావణాన్ని పొరపాటున సేవించాడు. కొద్దిసేపటికి తీవ్ర కడుపు మంటగా ఉందని చెప్పడంతో అక్కడ ఉన్న సహోద్యోగులు అతడిని వెంటనే చౌటుప్పల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం ఉస్మానియా ఆస్పత్రికి రిఫర్ చేయగా, చికిత్స పొందుతూ ఆసుపత్రిలోనే రవి తుదిశ్వాస విడిచాడు. ఈ ఘటనపై మృతుడి అన్న కొడుకు గుడ్డేటి లవ కుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కృష్ణ మాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Sthanikam

ప్రమాదవశాత్తు కెమికల్ సేవించి వ్యక్తి మృతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News