Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 05:42 AM

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యం సురక్షితం ఇజ్జిగాని, మాదాసు

09-03-2026 51 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చాట్రాయి : ఏలూరు జిల్లా నూజివీడు నియోజకవర్గం చాట్రాయి మండలం జనార్ధనవరం గ్రామంలో మహిళా రైతు సాధికార ఏపీసీఎన్ ఆధ్వర్యంలో “ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను వాడుదాం – ఆరోగ్యాన్ని కాపాడుకుందాం” అనే అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామ టిడిపి పార్టీ అధ్యక్షులు మాదాసు చిన్న పుల్లయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి స్థానిక ప్రజలు మంచి స్పందన చూపారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చాట్రాయి టిడిపి మండల పార్టీ అధ్యక్షులు అధ్యక్షులు ఇజ్జిగాని వెంకటేశ్వరావు హాజరై మాట్లాడుతూ రసాయనాల వినియోగం పెరుగుతున్న ఈ కాలంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులను ఉపయోగించడం ద్వారా ప్రజలు అనేక వ్యాధుల నుంచి దూరంగా ఉండవచ్చని తెలిపారు. రైతులు ప్రకృతి వ్యవసాయాన్ని మరింతగా ప్రోత్సహించి ఆరోగ్యకరమైన ఆహారాన్ని సమాజానికి అందించాలని పిలుపునిచ్చారు.

మాదాసు చిన్న పుల్లయ్య మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరించడం వల్ల భూమి సారాన్ని కాపాడటంతో పాటు ప్రజలకు నాణ్యమైన ఆహారం అందుతుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ టిడిపి పార్టీ ప్రధాన కార్యదర్శి బలువూరు రత్తయ్య, ఎన్‌పీఎం అధికారి ప్రసన్న, ఏపీఎం వెంకటరత్నం, సీసీలు ప్రసాద్, స్వరూప, శ్రీనివాసరావు, హెచ్‌ఎల్‌పీఎం ఐఆర్‌ఓసీలు, మహిళా సాధికార రైతులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు.

Sthanikam

ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులు వాడితే ఆరోగ్యం సురక్షితం ఇజ్జిగాని, మాదాసు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News