Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: September 01, 2026 10:48 AM

ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు

ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు

ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు
23-02-2026 93 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Biksham

పెండింగ్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి పెట్టాలి : జిల్లా కలెక్టర్

సూర్యాపేట ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులపై అధికారులు సత్వరమే చర్యలు తీసుకొని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆయన ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజావాణి కార్యక్రమానికి అధికారులు తప్పనిసరిగా హాజరుకావాలని సూచించారు. వివిధ శాఖల్లో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై శాఖల వారీగా ప్రత్యేక శ్రద్ధ పెట్టి పరిష్కరించాలని ఆదేశించారు. రాష్ట్ర స్థాయి ప్రజావాణిలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను కూడా త్వరితగతిన పరిష్కరించాలని పేర్కొన్నారు.

సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో భూ సమస్యలకు సంబంధించిన 48 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. జిల్లా పంచాయతీ అధికారికి సంబంధించిన 8, వైద్య ఆరోగ్య శాఖకు 7, గ్రామీణ అభివృద్ధి సంస్థకు 6, మిగిలిన 30 దరఖాస్తులు వివిధ శాఖలకు చెందినవిగా మొత్తం 99 దరఖాస్తులు స్వీకరించామని చెప్పారు. వాటిని శాఖల వారీగా పంపించి పరిష్కారానికి చర్యలు ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ కే. సీతారామారావు, మహిళా శిశు సంక్షేమ అధికారి కే. నర్సింహారావు, డి ఎస్ సి డి ఓ కే. దయానంద రాణి, జిల్లా విద్యాశాఖ అధికారి ఆశోక్, గిరిజన సంక్షేమ అధికారి శంకర్, పశుసంవర్ధక శాఖ అధికారి శ్రీనివాస్ తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి ఫిర్యాదులపై వెంటనే చర్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News