Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
18 కాలనీల డంపింగ్‌ యార్డ్‌ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పృథ్వీ చౌదరి. దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 09:29 AM

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం. కలెక్టర్‌ అనురాగ్ జయంతి

18-05-2026 37 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కరరావు, రెవెన్యూ అదనపు కలెక్టర్ వెంకారెడ్డితో కలిసి ప్రజల నుంచి వచ్చిన 51 అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తును సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా సమయపాలనతో వ్యవహరించాలని తెలిపారు.

ప్రజావాణిలో రెవెన్యూ శాఖకు 32, హౌసింగ్‌కు 5, జిల్లా సంక్షేమ శాఖకు 3, మున్సిపాలిటీ, సర్వే ల్యాండ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలకు రెండేసి, పంచాయతీ, ఎక్సైజ్‌, ఇరిగేషన్‌, చేనేత జౌళి, జిల్లా పరిషత్ శాఖలకు ఒక్కొక్కటి చొప్పున దరఖాస్తులు వచ్చినట్లు వెల్లడించారు.

అనంతరం నిర్వహించిన సమీక్షలో ఉద్యోగుల బదిలీల ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రజావాణిలో వచ్చిన అర్జీలను కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి సమస్యలు పరిష్కరించాలని సూచించారు.

కార్యక్రమంలో డీఆర్‌డీవో నాగిరెడ్డి, జడ్పీ సీఈవో శోభారాణి, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజావాణి అర్జీలకు తక్షణ పరిష్కారం. కలెక్టర్‌ అనురాగ్ జయంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News