Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మిలాద్‌ వేడుకల్లో ఐక్యత, సోదరభావం చాటిన సింగీతం ప్రజలు అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 27, 2026 06:45 AM

ప్రజాసేవకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.డల్లాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డి

07-06-2026 201 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నారాయణపేట, జూన్ 6 :

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా, సామాజిక సేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఈ అవార్డును శనివారం హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ రాజ్‌కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను జన్మించిన ప్రాంత అభివృద్ధే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, వైద్య సేవలు, తాగునీటి సదుపాయాలు, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు, దేవాలయాల అభివృద్ధి వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నారాయణపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల మన్ననలు, ఆశీస్సులే తనకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

అమెరికా డల్లాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉందని, ఈ గౌరవంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని రాజ్‌కుమార్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

జిల్లా ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధే తన లక్ష్యమని, నియోజకవర్గానికి శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా సేవలు కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

Sthanikam

ప్రజాసేవకు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు.డల్లాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డి

Article Image

నారాయణపేట, జూన్ 6 :

ప్రజా సమస్యల పరిష్కారమే పరమావధిగా, సామాజిక సేవనే లక్ష్యంగా ముందుకు సాగుతున్న భీష్మరాజ్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ కె. రాజ్‌కుమార్ రెడ్డికి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవం లభించింది. సామాజిక సేవా కార్యక్రమాలకు గుర్తింపుగా అమెరికాలోని డల్లాస్ యూనివర్సిటీ ఆయనకు గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది.

ఈ అవార్డును శనివారం హైదరాబాద్‌లోని ఆబిడ్స్‌లో జరిగిన కార్యక్రమంలో అందజేశారు. ఈ సందర్భంగా నారాయణపేట జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు, సామాజిక కార్యకర్తలు, అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ రాజ్‌కుమార్ రెడ్డికి అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా రాజ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ, తాను జన్మించిన ప్రాంత అభివృద్ధే తన జీవిత లక్ష్యమని పేర్కొన్నారు. భీష్మరాజ్ ఫౌండేషన్ ద్వారా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం, వైద్య సేవలు, తాగునీటి సదుపాయాలు, విద్యా ప్రోత్సాహక కార్యక్రమాలు, దేవాలయాల అభివృద్ధి వంటి అనేక సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

నారాయణపేట నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలకు అండగా నిలుస్తూ వారి సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. ప్రజల మన్ననలు, ఆశీస్సులే తనకు మరింత ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయని పేర్కొన్నారు.

అమెరికా డల్లాస్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ అందుకోవడం ఆనందంగా ఉందని, ఈ గౌరవంతో తనపై మరింత బాధ్యత పెరిగిందని రాజ్‌కుమార్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో భీష్మరాజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నారాయణపేట జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.

జిల్లా ప్రజల ఆర్థిక, సామాజిక అభివృద్ధే తన లక్ష్యమని, నియోజకవర్గానికి శాశ్వత పరిష్కారాలు అందించే దిశగా సేవలు కొనసాగిస్తానని ఆయన స్పష్టం చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News