Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 03:08 PM

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

07-02-2026 147 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి

చౌటప్పుల్ పట్టణం ఓటర్లలో చైతన్యం నింపేందుకు చేపట్టిన స్వీప్ కార్యక్రమంలో భాగంగా నేడు మున్సిపల్ కార్యాలయం ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని సహాయ జిల్లా ఎన్నికల అధికారి, మున్సిపల్ కమిషనర్ జి. వెంకట్రామిరెడ్డి ప్రారంభించారు.మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ర్యాలీ తంగడిపల్లి రోడ్డు చౌరస్తా మీదుగా నాగులకుంట జంక్షన్ కు చేరుకుంది. అక్కడ విద్యార్థులు, మహిళా సంఘాలు, మున్సిపల్ సిబ్బందితో కలిసి భారీ మానవ హారం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ అందరితో కలిసి ఓటరు ప్రతిజ్ఞ చేయించారు. కుల, మత, జాతి విభేదాలకు అతీతంగా,ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు వేస్తామని అందరూ ప్రతిజ్ఞ చేశారు. అనంతరం ర్యాలీ ప్రభుత్వ ఆసుపత్రి మీదుగా సాగి తిరిగి మున్సిపల్ కార్యాలయానికి చేరుకుంది.కమిషనర్ మాట్లాడుతూ మున్సిపాలిటీలోని ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును బాధ్యతగా వినియోగించుకుని ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ శ్రీధర్ రెడ్డి, ఆర్.ఓ.అంజయ్య, శానిటరీ ఇన్స్పెక్టర్ హనుమాన్ ప్రసాద్, పర్యావరణ ఇంజనీర్ రేణు కుమార్, వార్డ్ ఆఫీసర్లు, బిల్ కలెక్టర్లు, పారిశుద్ధ్య సిబ్బంది, ఎలక్ట్రిషియన్లు, వాటర్మెన్ లు, మహిళా సంఘం రిసోర్స్ పర్సన్స్, మహిళా సంఘం సభ్యులు, ట్రినిటీ పాఠశాల విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News