Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నారాయణఖేడ్ 9వ వార్డులో నూతన హైమాస్ట్‌ లైట్లు ఏర్పాటు దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 10, 2026 06:22 AM

ప్రజా,రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను,కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దగ్ధం చేస్తున్న ఇక్కుర్తి రైతులు

07-02-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా స్టాఫ్ రిపోర్టర్
Sthanikam District Staff Reporter

కేంద్ర మోడీ బీ జే పీ ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ నినాదాలతో మారు మ్రోగిన ఇక్కుర్తి బస్టాండ్ సెంటర్

మోటకొండూరు: మోడీ బీ జే పీ కేంద్ర ప్రభుత్వం ముందుకు తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాలను,బిల్లులను వ్యతిరేకించకుండా దేశ ప్రజలకు భవిష్యత్ లేదని ఐ ఎఫ్ టి యు తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.జనార్ధన్,అఖిల భారత రైతు.కూలీ సంఘం(ఏ.ఐ.కే.ఎం.ఎస్)జిల్లా అద్యక్షులు కల్లెపు అడివయ్య లు పేర్కొన్నారు. శనివారం నాడు మోటకొండూరు మండలం ఇక్కుర్తి లో మోడీ బీ జే పీ రైతు,కార్మిక వ్యతిరేక చట్టాలు,బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను ఐ ఎఫ్ టి యు, ఏ ఐ కే ఎం ఎస్ లో ఆధ్వర్యంలో దగ్ధం చేశారు.ఈ సందర్భంగా జనార్ధన్, అడివయ్య లు మాట్లాడుతూ,బీజేపీ ప్రజా క్షేమానాన్ని,దేశ ప్రయోజనాలను,అభివృద్ధిని ఏమాత్రం దృష్టిలో ఉంచుకోకుండా,పిడికెడు మంది బడా కార్పోరేట్ సంస్థలకు,అమెరికా లాంటి సామ్రాజ్యవాద శక్తుల ప్రయోజనాల కోసమే తమ పాలనను కొనసాగిస్తున్నదని అందులో భాగమే అమెరికా తో స్వేచ్చా వాణిజ్యం పేరుతో ఒప్పందాలను చేసుకొని ఎగుమతి దిగుమతుల విషయంలో దేశ రైతాంగానికి,ప్రజలకు నష్టం వచ్చే విధంగా అమెరికా కు లొంగిపోతుందని విమర్శించారు.కార్మికులు పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్ లను ముందుకు తెంచాడని,రైతులకు వ్యతిరేకమైన విత్తన, విద్యుత్ సవరణ బిల్లులను తెచ్చాడని,చంద్ర బాబు,నితీశ్ కుమార్ ల మద్దతుతో పార్లమెంట్ లో బలం ఉన్నదని ప్రజా వ్యతిరేక బిల్లులను తెచ్చి బీ జే పీ దేశ ప్రజలను మోసం చేస్తుందని,ప్రజా,రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఫిబ్రవరి 12న దేశ వ్యాప్తంగా కార్మిక సంఘాలు ఒక్కరోజు దేశ సమ్మె కు పిలుపు నిచ్చాయని,ఈ సమ్మె కు జాతీయ రైతు సంఘాల వేదిక ఎస్ కే ఎం మద్దతు నిచ్చిందని,అన్ని వర్గాల ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏ.ఐ.కే.ఎం.ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు చిర బోయిన రాజయ్య,జిల్లా సహాయ కార్యదర్శి పిన్నపురెడ్డి రాఘవ రెడ్డి,జిల్లా నాయకులు చిర బోయిన కొమురయ్య, వంగాల నర్సింహారెడ్డి,చిర బోయిన బాలయ్య,వంగాల మధుసూదన్ రెడ్డి,సిఖిలం వెంకటేష్, ఊరడి రామ చంద్రు,బడికే ఉపేందర్,పాలసెంటర్ ఛైర్మెన్ దడిగ రాములు,ఓరుగంటి మైసయ్య,ఎం.డీ.ఖలీల్,రాజబోయిన స్వామి,గండికోట వెంకటేష్,ఓర్సు నరసింహులు,బండి చంద్రయ్య,శివరాత్రి నర్సింహులుఓర్సు యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

ప్రజా,రైతు, కార్మిక వ్యతిరేక చట్టాలను,కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ ను దగ్ధం చేస్తున్న ఇక్కుర్తి రైతులు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News