Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మున్సిపల్ కార్మికుడి కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 04:13 PM

“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”

“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”

“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”
22-03-2026 83 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
K.RAVI

గ్యారంటీల అమలులో వైఫల్యం: సుర్కంటి శ్రీధర్ రెడ్డి మందోళ్ల గూడెం ఉపసర్పంచ్

కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన బడ్జెట్‌గా నిలిచిందని మందోళ్ల గూడెం ఉపసర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ చౌటుప్పల్ మండల అధికార ప్రతినిధి సుర్కంటి శ్రీధర్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… వృద్ధులకు పెన్షన్లు పెంచడం, కొత్తగా వితంతు పింఛన్లు మంజూరు చేయడం, రైతులకు రైతుబంధు అమలు చేయడం, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ అందించడం వంటి కీలక అంశాలకు నిధులు లేవని ప్రభుత్వం చెబుతూనే, మరోవైపు సీఎం, మంత్రుల కార్యక్రమాల పేరుతో వేల కోట్ల ప్రజాధనాన్ని దుబారా చేస్తున్నారని ఆరోపించారు.కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారంటీలు, 420 హామీలు అమలు కాకుండా అటకెక్కిపోయాయని, ప్రజలను మభ్యపెట్టే విధంగా బడ్జెట్ రూపొందించారని అన్నారు. అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రవర్తన కూడా తగిన విధంగా లేదని విమర్శించారు.బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులను కొనసాగించకుండా, కాంగ్రెస్ ప్రభుత్వం, ఎమ్మెల్యేలు ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు. 6 గ్యారంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

Sthanikam

“ప్రజలను మోసం చేసిన బడ్జెట్”

Article Image

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News