Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉచిత పోలీసు శిక్షణకు ఎంపిక పరీక్ష.. సమయానికి చేరుకోవాలని ఎస్పీ సూచన దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం మా పోరాటం ఆగదు: సీజేపీ వ్యవస్థాపకులు అభిజీత్ దీప్కే కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌కు అంతర్జాతీయ అరుదైన గౌరవం: ఇజ్రాయెల్ స్వాతంత్ర్య వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ప్రధాని నెతన్యాహు ఆహ్వానం మూఢనమ్మకాల పరాకాష్ట: చేతబడి పేరుతో వృద్ధ మహిళపై అమానుష దాడి, చెట్టుకు కట్టి చిత్రహింసలు! "మట్టిలో పుట్టి, మడిలో కలిసే విఘ్నేశ్వరుడు: గణపతి నిమజ్జనం వెనుక ఉన్న మహా వేదాంతం!" అభిషేక్ శర్మ సునామీ ఇన్నింగ్స్.. ఆఫ్ఘనిస్తాన్పై భారత్ ఘన విజయం! హిందూ అవిభక్త కుటుంబ ఆస్తిలో హక్కులు, వాటాలు, విభజన విధానం – తాజా చట్టపరమైన అవగాహన నిర్మాణ రంగ కార్మికుల హక్కుల కోసం పోరాటాలను మరింత ఉధృతం చేయాలి డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: October 09, 2026 08:19 PM

ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు

31-12-2025 36 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ స్థానిక ప్రతినిధి

రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా కృషి చేయాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఖమ్మంలోని ఎస్.ఆర్. కన్వెన్షన్ హాల్లో జరిగిన ఏదులాపురం మున్సిపాలిటీ సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లో ఉండి నిరంతరం సమస్యలపై పోరాడే నాయకులకే అభ్యర్థిత్వం దక్కుతుందని స్పష్టం చేశారు. కటౌట్లు పెట్టడం, హడావుడి చేయడం వల్ల టికెట్లు రావని, గెలుపు సామర్థ్యం ఉన్నవారికే బి-ఫామ్ ఇస్తామని తేల్చి చెప్పారు.ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 32 వార్డుల్లోనూ కాంగ్రెస్ జెండా ఎగరేయడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కదలాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం గత రెండేళ్లలో చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ఉపాధి హామీ పథకం, ఇందిరమ్మ ఇళ్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలు ప్రజలకు ఎలా మేలు చేస్తున్నాయో ఇంటింటికీ వివరించాలని అన్నారు.

ప్రతి వార్డులో పెండింగ్‌లో ఉన్న రోడ్లు, డ్రైనేజీలు, తాగునీటి సమస్యలను గుర్తించి అధికారులకు నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు. ఎన్నికల షెడ్యూల్‌కు ముందే వీలైనంత పనులు పూర్తిచేసేందుకు నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. ఏదులాపురం మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని మంత్రి తెలిపారు.

Sthanikam

ప్రజల్లో ఉన్నవారికే అవకాశం – అభ్యర్థుల ఎంపికపై మంత్రి వ్యాఖ్యలు

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News