Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాఖీ తిరుగు ప్రయాణాలతో బస్టాండ్ లో సందడి “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 09:23 AM

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం : కమిషనర్ వి. ప్రశాంతి

12-05-2026 65 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Krishna

నారాయణఖేడ్ పట్టణంలోని ఒకటో వార్డులో మున్సిపల్ కమిషనర్ వి. ప్రశాంతి మంగళవారం పర్యటించి పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా పరిస్థితులను పరిశీలించారు. వార్డులో చెత్తాచెదారం తొలగింపు, మురికి కాలువల శుభ్రపరిచే పనులు, రోడ్లకు ఇరువైపులా పెరిగిన పిచ్చి మొక్కల తొలగింపు వంటి పారిశుద్ధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని మున్సిపల్ సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పరిశుభ్రమైన వాతావరణం కల్పించాలన్నారు.అదేవిధంగా చాంద్ కనపల్లి ప్రాంతంలో తాగునీటి సరఫరా సక్రమంగా అందేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తాగునీటి సరఫరా సిబ్బందికి సూచించారు. నీటి సమస్యలు తలెత్తకుండా సమయానికి సరఫరా అందించడంతో పాటు పైపులైన్ సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కమిషనర్ ఆదేశాల మేరకు పారిశుద్ధ్య పనులు వేగవంతం చేస్తున్నామని శానిటేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. ఈ పర్యటనలో ఒకటో వార్డు మున్సిపల్ కౌన్సిలర్ లలిత రామకృష్ణ,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

ప్రజలకు మెరుగైన సేవలందించడమే లక్ష్యం : కమిషనర్ వి. ప్రశాంతి

Article Image

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.

కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News